ఎక్క‌డ చూసినా ఫ్లాట్ ఫ‌ర్ సేల్‌!

ప్ర‌భుత్వం ఉద్యోగులు అమ‌రావ‌తికి క్యూ క‌డుతున్నారు. మూటా ముల్లె స‌ర్దుకుని విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల‌కు వెళుతున్నారు. ఇంకా స‌మ‌యం ప‌డుతుంది.. లేదంటే గ‌డువు ఇస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఉద్యోగులకు చంద్ర‌బాబు షాకివ్వ‌డంతో వెళ్ల‌క త‌ప్ప‌డం లేదు. స్కూల్స్ అడ్మీష‌న్‌, స్థానిక‌త, ఇత‌ర అంశాల దృష్ట్యా షిఫ్టింగ్ మంచిద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన ఉద్యోగులు కుటుంబాల‌ను కూడా త‌ర‌లిస్తున్నారు. పోనీ హైద‌రాబాద్‌లో ఉండి అప్ అండ్ డౌన్ చేద్దామ‌న్నా జ‌నాల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంది. 27 త‌ర్వాత గ‌డువు ఇవ్వాలంటేనే సోష‌ల్ మీడియాలో జ‌నాలు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు అప్ అండ్ డౌన్ పేరుతో సేవ‌ల్లో ఏమాత్రం తేడా వ‌చ్చినా ప్ర‌జ‌లు తిట్టిపోస్తారు. ఎలా చూసినా వెళ్ల‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇది హైద‌రాబాద్ వాసుల‌కు వ‌రంగా మారింది.. ఇళ్ల ధ‌ర‌లు కాస్త దిగొస్తున్నాయి.


హైద‌రాబాద్ నుంచి కుటుంబాల‌తో స‌హా వెళుతున్న ఉద్యోగులు త‌మ ఇళ్ల‌ను అమ్మ‌కానికి పెడుతున్నారు.

అమ్మకానికి ఇళ్లు
అమ్మకానికి ఇళ్లు

 తమ పిల్లలు విదేశాల్లో ఉండి ఇన్వెస్ట్ మెంట్ కోసం కొన్న ఇళ్లు కూడా అమ్ముతున్నారు. మియాపూర్‌, దిల్‌షుఖ్‌న‌గ‌ర్‌, ఖైర‌తాబాద్‌, ఎస్.ఆర్‌.న‌గ‌ర్ ప్రాంతాల్లోని కాల‌నీల్లో హౌస్ ఫ‌ర్ సేల్‌, ఫ్లాట్ ఫ‌ర్ సేల్ విప‌రీతంగా పెరిగాయి. హౌసింగ్‌, 99 ఎక‌ర్‌, కామ‌న్ ఫ్లోర్ వంటి సైట్ల‌లో కూడా యాడ్స్ విప‌రీతంగా ద‌ర్శ‌నిస్తున్నాయి. కొంద‌రు అయితే నాలుగైదు ల‌క్ష‌లు త‌గ్గినా ఫ‌ర్వాలేదు అమ్ముకుని నవ్యాంధ్రలో కొనుక్కుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో ఇళ్లు కొనాల‌నేవారికి హైద‌రాబాద్‌లో త‌క్కువ ధ‌ర‌కే దొరుకుతున్నాయి. గేటెడ్ క‌మ్యూనిటీల్లో కూడా ధ‌ర‌లు త‌గ్గిపోయాయి. కొత్త ప్రాజెక్టుల్లో ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌డ‌డంతో.. పాత‌వాటిని కొనుగోలుదారులు ఆస‌క్తి చూపుతున్నారు. పైగా బ్యాంకుల‌కు రుణాలు కావాల‌ని వ‌స్తున్న‌వి కూడా ఎక్కువ‌గా రీసేల్ ప్రాప‌ర్టీస్ ఉంటున్నాయ‌ని ఆయా వ‌ర్గాలు చెబుతున్నాయి. సో.. హైద‌రాబాద్‌లో ఇల్లు కావాలంటే బెట‌ర్ టూ బై దీజ్ డేస్‌…

Recommended For You

Comments are closed.