నోటిదూల.. సోషల్ మీడియా పిచ్చ.. వెరసి ఇండస్ట్రీకి బొక్క

నీస అవగాహన, సందర్భం లేకుండా సైట్లు ఉన్నాయని కదా… అడ్డదిడ్డంగా వార్తలు రాయడం అలవాటు అయింది కొందరిది. ఏమాత్రం సంకోచం లేకుండా ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఇటీవల బాలక్రిష్ణ, చిరంజీవి ఇంట్లో సమావేశం విషయంలో జరుగుతున్న వివాదాన్ని కొందరు కావాలని అర్ధం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. కామన్ సెన్స్ లేకుండా కులం లెక్కలు అంటగడుతున్నారు. ఇందులో అసలు కులం ప్రస్తావన ఎక్కడుంది. కమ్మ వర్సెస్ కాపు అని ఇష్టమొచ్చినట్టు చర్చలు పెడుతున్నారు. నిజంగా కమ్మ వర్సెస్ కాపు అయితే దగ్గుబాటి కుటుంబం ఎవరు? అక్కినేని కుటుంబం ఏంటి? దిల్ రాజు కులం ఏంటి? రాజమౌళి కులం ఏంటి? త్రివిక్రమ్ శ్రీనివాస్ కులమేంటి? దర్శకుడు శంకర్ ఏ కులానికి చెందినవాడు. ఏమాత్రం సంబంధం లేకుండా కులం లెక్కలు అంటగడుతూ రాయడం పరిశ్రమను ఇబ్బందుల్లో పడేయటమే.
వాస్తవానికి ఇది బాలక్రిష్ణ తన సహజశైలిలో మాట్లాడారు. ఇది తప్పేకావొచ్చు. కానీ నాగబాబు అంత వైల్డ్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. వాస్తవానికి నాగబాబు ఈ మధ్య స్పందిస్తున్న తీరు కాస్త ఇండస్ట్రీకే కాదు.. మెగా ఇంటికి కూడా సమస్యలు తీసుకొస్తుంది. అలా స్పందించకుండా ఉండి… బాలక్రిష్ణతో పెద్దలు రాయభారం నడిపితే పోయేదానికి పెద్దది చేశారు. నాగబాబు రియాక్ట్ అవగానే…. కొందరు అత్యుత్సాహం గాళ్లు వెంటనే కులం రంగు పూయడం మొదలుపెట్టారు. ఇది అంతిమంగా ఇండస్ట్రీకి నష్టం చేసిదిగా మారింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఇండస్ట్రీకి ఈ వివాదం అవసరమా? యంగ్ హీరోలంతా సరదాగా కలిసి పనిచేసుకుంటుంటే… సీనియర్లు ఇలా కామెంట్లతో రోడ్డెక్కడమేంటని సగటు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఓ నటుడికి సోషల్ మీడియా పిచ్చ ఎక్కువైంది… మరొకాయనకు మొదటి నుంచినోటిదూ ఉంది. వెరసి ఇండస్ట్రీకి బొక్కపడింది. దీనిని మీడియా అలుసుగా తీసుకుని ఇష్టమొచ్చిన రివ్యూలు.. చర్చలు పెడుతున్నాయి. కులం రంగు పూస్తున్నాయి.

Recommended For You