ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చంద్రబాబేనా..?

ప్ర‌పంచాన్ని న‌డిపిస్తున్న కంప్యూట‌ర్ ను ఆయ‌న క‌నిపెట్ట‌లేదు కానీ… విడ‌దీయ‌రాని అనుబంధం అయితే ఉంది చంద్ర‌బాబుకు. అందుకే కాబోలు.. ఓ యూనివ‌ర్శిటీ ఎంట్ర‌న్స్ టెస్టులో ఫాద‌ర్ ఆఫ్‌ కంప్యూట‌ర్ ఎవ‌రు అన్న ప్ర‌శ్న వేసి.. న‌లుగురి పేర్లు కింద ఇచ్చారు. బిల్ గేట్స్, ఆగ‌స్ట‌స్‌, చార్లెస్ బాబేజ్ తో పాటు సి.బి.నాయుడు అంటే మన చంద్ర‌బాబునాయుడు పేరు కూడా ఉంచారు. కంప్యూట‌ర్ అంటే చంద్ర‌బాబు, చంద్ర‌బాబు అంటే హైటెక్ అని ప్ర‌చారం ఉంది. అందుకే ఆయ‌న పేరు కూడా ఇందులో చేర్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఫాద‌ర్ ఆఫ్ టెక్నాల‌జీ గ‌వ‌ర్పెన్స్ క‌దా.. అందుకే అలా పెట్టిన‌ట్టున్నారు. యాదృశ్చిక‌మే అయినా చంద్ర‌బాబుకు మంచి కితాబే ఇచ్చారంటున్నారు. నిజ‌మో కాదో కానీ ఉస్మానియా వ‌ర్శిటీలో మాస్ట‌ర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో ఈ ప్రశ్న వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

Recommended For You

Comments are closed.