ఆన్‌లైన్ కంపెనీకు హ్యాండిస్తున్న జ‌నం…

భారీగా ఆశ‌లు పెట్టుకున్న  ఆన్‌లైన్ కంపెనీల‌కు జ‌నాలు హ్యండిస్తున్నారు. అవును ఈ కామ‌ర్స్ సంస్థ‌లు ద‌స‌రా, దీపావ‌ళికి బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించినా క‌స్ట‌మ‌ర్లు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌. ఫ్లిప్‌కార్ట్‌, అమోజాన్ సంస్థ‌లు బిగ్ బిలియ‌న్ సేల్స్‌కు స్పంద‌న అంతంత‌మాత్ర‌మేన‌ట‌. గ‌తంలో స‌ర్వ‌ర్లు సైతం  హ్యాంగ్‌ అయ్యే స్థాయిలో యూజ‌ర్లు సైట్‌ల‌ను విజిట్ చేసి ఉత్ప‌త్తులు కొన్నారు. కానీ ఈ సారి ప‌రిస్థితి తారుమారు అయింద‌ట‌. సేల్స్ మొద‌లైన 12 గంటల్లోనే కంపెనీల‌కు సీను అర్ధం అయ్యింద‌ట‌. దీంతో ఆఫ‌ర్లు ఇంకా పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌లు, ఇత‌ర నిబంధ‌న‌ల కార‌ణంగా పెద్ద‌గా డిస్కౌంట్ ఇవ్వ‌లేక‌పోతున్నాయి.  పైగా వీరికి పోటీగా షాప్స్ కూడా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. గ‌తం కంటే పోటీ ఎక్కువ అయింది. అమ్మ‌కాలు త‌గ్గిన నేప‌థ్యంలో కంపెనీలు కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి. ఫ్లిప్‌కార్ట్ 3వేల 3వంద‌ల కోట్ల అమ్మ‌కాల‌పై క‌న్నేసింది. మొద‌టి 12 గంట‌ల్లో ఇందులో 5శాతం కూడా చేరుకోలేద‌ని తెలుస్తోంది. అటు అమోజాన్ కూడా అదే ప‌రిస్థితి. మ‌రి స్నాప్‌డీల్ కూడా అంతే. మ‌రి క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకట్టుకోవ‌డానికి ఏం చేస్తారో చూడాలి. మొత్తం 10వేల కోట్ల అమ్మ‌కాలు జ‌రుగుతాయ‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేశారు. కానీ ప‌రిస్థితులు చూస్తుంటే అందుకోవ‌డం అనుమాన‌మే.

Recommended For You

Comments are closed.