మాజీల‌కు కేసీఆర్ వ‌రాలు

మ్మెల్యేల‌కు విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు క‌ట్టిస్తున్న కేసీఆర్ మ‌రో వ‌రం కూడా ప్ర‌క‌టించారు. అదే ప‌ద‌వి పోయిన త‌ర్వాత కూడా వారికి భారీ మొత్తం పెన్ష‌న్ ఇవ్వ‌డానికి సిద్ద‌ప‌డ్డారు. మాజీ ప్ర‌జాప్ర‌తినిధిగా వారికి ఇప్ప‌టికే కొంత వేత‌నం ఇస్తున్నారు. బ‌స్‌పాస్‌లు, హెల్త్ కార్డులు, ఇతర, ఇళ్ల స్థ‌లాలు వంటి స‌దుపాయాలు ఇస్తున్నారు. ఇక వారికి భారీ మొత్తంలో నెల‌నెలా పెన్ష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఒక్క‌సారి ఎమ్మెల్యే అయితే చాలు వారికి 40వేలు ఇస్తార‌ట‌.. రెండు సార్లు గెలిచిన వారికి 50వేలు, మూడుసార్లు అంత‌కంటే ఎక్కువ‌సార్లు గెలిస్తే 60వేలు. ఇప్ప‌టికే ప‌ద‌విలో ఉన్న‌వారికి ల‌క్ష‌లు, ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ఎంతైనా రిచ్ స్టేట్ క‌దా… ఆమాత్రం ఇవ్వ‌క‌పోతే ఎలా అని మాజీలు అన్నారట‌.. అంతే వ‌రం ఇచ్చేశారు.

Recommended For You

Comments are closed.