కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై విప‌క్షాల గుస‌గుస‌లు

సెంబ్లీలో మంగ‌ళ‌వారం మాజీ సైనికుల అంశంపై చ‌ర్చ జ‌రిగింది. దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న అమ‌రుల‌తో పాటు.. ప్రాణత్యాగాలు చేయ‌డానికి సిద్ద‌ప‌డి రిటైర్ అయిన మాజీ సైనికుల‌ను గౌర‌వించుకోవ‌డం మ‌న ధ‌ర్మం అని సిఎం ప్ర‌క‌టించారు. భారీ ఆర్ధిక సాయం ప్ర‌క‌టించి ఉద్దాత్త‌ను చాటుకున్నారు. దీనిని అంతా స్వాగ‌తిస్తున్నారు. కానీ ఆయ‌న ప్ర‌క‌ట‌న త‌ర్వాత మాత్రం కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు, ఉద్యోగుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరిందట. సైనికుల విష‌యంలో సాయం చేయ‌డానికి తాము స‌దా సిద్దంగా ఉన్నాం. కానీ మాకు మాట కూడా చెప్ప‌కుండా ఒక రోజు వేత‌నం ఇవ్వాల‌ని అసెంబ్లీలో ప్ర‌క‌టించ‌డానికి వారు త‌ప్ప‌బ‌డుతున్నారట. బ‌య‌ట‌కు అన‌క‌పోయినా.. ఎమ్మెల్యేల్లో విసృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ స‌మావేశంలో కూడా దీనిపై చ‌ర్చ జ‌ర‌గ‌లేదని.. ఇలా ఒక్క‌సారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌మ వేత‌నాల నుంచి మాజీ సైనికుల‌కు సాయం చేస్తార‌ని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల వారు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారట. వ‌రాలు ఇవ్వ‌డంలో త‌ప్ప‌లేదు.. ముందుగానే మా నుంచి హామీ తీసుకుని.. త‌ర్వాత అసెంబ్లీలో చ‌ర్చ పెడితే భాగుండేద‌ని అంటున్నారు. ప్రజాస్వామ్య ప‌ద్ద‌తిలో కాకుండా.. ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం త‌గ‌దంటున్నారు. వాస్త‌వానికి ఇలాంటి విష‌యాల్లో పార్టీల‌కు విధానం ఉంటుంది. నాయకత్వం చర్చించి నిర్ణ‌యం తీసుకుంటుంది. ఎమ్మెల్యేలు పాటిస్తారు. సిఎంలు స‌హ‌జంగా అలాంటి ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీల‌ అబిప్రాయాలు ముందుగా తెలుసుకోవాలి. వారి స‌మ్మ‌తి తీసుకుని మాత్ర‌మే ప్ర‌క‌ట‌న చేయాలి. ఇది ప్ర‌జాస్వామ్య పద్ద‌తి.. అలా కాకుండా.. విప‌క్షాల స‌భ్యుల త‌ర‌పున కూడా సిఎం ఏక‌ప‌క్షంగా ఎలా హామీ ఇస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. అయితే ఇది దేశభ‌క్తి, సున్నిత అంశం కావ‌డంతో పెద్ద‌గా వివాదం చేయ‌డం లేదట. నాయకుల ఛాంబర్లు దాటి బయటకు రావడం లేదు.

ఉద్యోగులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. త‌మ‌కు మాట మాత్రం చెప్ప‌లేదు. శాఖ‌ల‌కు కానీ, హెచ్ ఓ డీ ల‌కు కానీ మౌఖిక‌, లిఖిత పూర్వ‌క ఉత్త‌ర్వులు అంద‌లేదు. త‌మ అనుమ‌తి లేకుండా సిఎం ఒక‌రోజు వేత‌నం మాజీ సైనికుల‌కు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. ముందుగా చెప్పి ఉంటే.. బాగుండేద‌ని అంటున్నారు. ఎన్నో సంద‌ర్భాల్లో త‌మ వేత‌నాలు  చారిటీ కోసం ఇచ్చిన దాఖ‌లాలున్నాయి. సైనికులకు ఇవ్వ‌డానికి కూడా సిద్దంగా ఉన్నాం. కానీ ముందుగా స‌మాచారం ఇచ్చి అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేద‌ని అంటున్నారు. త‌మ వేతనాల‌పై ప్ర‌భుత్వ పెత్త‌నమేంటని ప్రశ్నిస్తున్నారట. విరాళాలు స్వ‌ఛ్చందంగా ఇచ్చేవి. కానీ ఇలా ముందుగా ప్ర‌క‌టించేవి కాద‌ని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ప‌ట్ల అటు పార్టీలు, ఇటు ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. త‌మ డ‌బ్బుల‌తో క్రెడిట్ కొట్టాల‌నుకోవ‌డం రాజ‌కీయం అనిపించుకోద‌ని విప‌క్షాలు అంటుంటే.. ఉద్యోగులు కూడా మాట కూడా చెప్ప‌క‌పోవ‌డం ప్ర‌భుత్వం త‌మ ప‌ట్ల ఉన్న చిన్న‌చూపున‌కు నిద‌ర్శ‌నం అంటున్నాయి.

Recommended For You

Comments are closed.