డిఎస్ అందుకే వచ్చారట

కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాసరావు. కానీ హఠాత్తుగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. గత లోక్ సభ ఎన్నికలలో డిఎస్… తన కుమారుడు, బిజెపి ఎంపీ అరవింద్ విజయానికి పరోక్షంగా ప్రయత్నించారనే ఆరోపణలొచ్చాయి. అక్కడ బరిలో దిగిన.. సిఎం కేసిఆర్ కుమార్తె కవిత ఓడిపోవడం కలకలం రేపింది. ఎన్నికలకు ముందే డి.ఎస్ పై చర్య తీసుకోవాలని నిజామాబాద్ పార్టీ నేతలు కేసిఆర్ ను కోరారు. అయినా పార్టీ నుంచి డిఎస్ సస్పెండ్ కాలేదు. కేసిఆర్ కు రాజకీయంగా దూరమైన డి.శ్రీనివాస్ ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ పిలిచారా..లేక మరో కారణముందా అని అంతా అనుకున్నారు.. కానీ అసలు విషయం ఏంటంటే..అందరికీ పంపిస్తూ పొరపాటున డిఎస్ కు ఆహ్వానం వెళ్లిందట. అది చూసి తనను పిలిచారని…డిఎస్ అనుకున్నారట. అందుకే సమావేశానికి హాజరయ్యారంటున్నారు. డిఎస్ వచ్చినా అక్కడున్న ఎంపీలు తమకు తెలియనట్లుగా వ్యవహరించారట. అసలు డిఎస్ ఎందుకొచ్చాడబ్బా అంటూ తర్వాత గుసగుసలాడుకున్నారు. పిలవమనకుండానే ఆహ్వానం ఎవరు పంపారు..ఏంటనే విషయం పై టీఆర్ఎస్ వర్గీయులు ఆరా తీశారట.

Recommended For You