డిఎస్ పై వేటు వేసిన రాజ్య‌స‌భ ప‌ద‌వి సేఫేనా..!

టిఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన డి.శ్రీనివాస్ పై వేటు వేయాల‌ని నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంతా ముక్త‌కంఠంతో తీర్మానం చేశారు. ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కేసీఆర్ కు లేఖ రాశారు. ఎంపీ క‌విత స్వ‌యంగా ప్రెస్ మీట్ పెట్టి ఈనిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌నపై వేటు వేస్తే ప‌ద‌వి పోతుందా.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఊడుతుందా.. ఇదే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఆయ‌న ప‌ద‌వికి వ‌చ్చిన ఢోకా లేదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇందుకు రెండు కార‌ణాలున్నాయి. డిఎస్ పై చ‌ర్య తీసుకోవ‌డం కంటే ఆయ‌న్ను త్రిశంకు స్వ‌ర్గంలో ఉంచ‌డ కేసీఆర్ వ్యూహం.. ఆయ‌న పార్టీలో ఉన్న‌ట్టే ఉంటారు.. కానీ ప‌ట్టించుకోరు. ఇత‌ర పార్టీల్లో చేరకుండా.. త‌మ‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా అయ‌న్ను అలా గాల్లో ఉంచుతారు.. దీని వ‌ల్ల ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు చేయ‌మ‌నే అవ‌కాశం లేదు. దీంతో పార్టీ నుంచి సేఫ్.. ఒక‌వేళ కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యిస్తే.. స‌స్సెండ్ చేసి రాజ్య‌స‌భ‌కు ర‌ద్దు కోసం పంపుతారు. ఇది ఛైర్మ‌న్ విచక్ష‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. శ‌ర‌ద్ యాద‌వ్ లాగా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు.. లేదా ఏళ్ల త‌ర‌బ‌డి నాన్చ‌వ‌చ్చు. అయితే ఆయ‌న త‌న‌యుడు అర్వింద్ ప్ర‌స్తుతం బీజేపీలో యాక్టీవ్ గా ఉన్నారు. ఆయ‌న‌కు మోడీతోనే నేరుగా ప‌రిచ‌యం ఉంది. ఢిల్లీ పెద్ద‌ల్లో ప‌లుకుబ‌డి ఉంది. త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో త‌న తండ్రి ప‌ద‌వికి కాపాడుకునే ఛాన్సుంది. రాజ‌కీయాల్లో ఇదో పెద్ద విష‌యం కూడా కాదు.. అందుకే డిఎస్ ధీమాగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Recommended For You