కారు కొనేముందు మార్కెట్‌లో ఏది చూడాలి

ఈరోజుల్లో కారు లగ్జరీ కాదు అవసరం.. ముగ్గురు అంతకంటే ఎక్కువమంది సభ్యులున్న కుటుంబం ప్రయాణం చేయాలంటే కారువైపు మొగ్గుచూపుతున్నారు. ప్రయాణంలో భద్రత.. సౌకర్యం కోసం మధ్యతగరతి ప్రజలు కారు వైపు చూస్తున్నారు. అందుబాటులో ధరల్లో కొత్తవి.. పాతవి ఉండడంతో కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. లగ్జరీ కార్లు కొనే సంపన్నులు ధర, ఇతర సదుపాయాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మధ్యతరగతి ప్రజలు తమ అవసరాలకు కొనేముందు ఖచ్చితంగా అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కారు కొత్తగా మార్కెట్లోకి వచ్చిందని ఏదిపడితే అది కొనకండి.. ఫీచర్లు ఊరిస్తాయి. రంగులు, హంగులు అధ్బుతంగా ఉంటాయి. కానీ తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో కార్ల కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా మోడల్స్‌ ను విడుదల చేస్తున్నాయి. అందులో సక్సస్‌ రేటు చాలాతక్కువగా ఉంది. అందుకే కారు కొనేముందు మోడల్‌ జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని కంపెనీలు విడుదల చేసిన తర్వాత మోడల్స్‌ సేల్‌ కాకపోతే ప్రొడక్షన్‌ ఆపేస్తాయి. ఉన్న స్టాకును డిస్కౌంట్‌ తో వదిలించుకుంటాయి.

Watch Video:

ఇటీవల కాలంలో హోండా కంపెనీ మోబిలియో, రినాల్డ్‌ సంస్థ ఎంజాయ్‌ వంటి కార్లు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాయి. మోడల్స్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. వాటిని కొన్నవాళ్లకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అందుకే కారు కొనేటప్పుడు మధ్యతరగతి ప్రజలు జాగ్రత్తగా లెక్కలేసుకోవాలి. మోడల్‌ బాగుందని కమిట్‌ అయితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మార్కెట్‌ లో కారు సేల్‌ ఎలా ఉంది.. ఎక్కువ కాలం ఉత్పత్తి ఉంటుందా? సర్వీసు సమస్యలు వస్తే సరిగ్గా అందుతాయా? విడిబాగాలు, సర్వీస్‌ ఛార్జీలు వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కోసారి కంపెనీలు కూడా మూతపడుతుంటాయి. ఇటీవల జనరల్‌ మోటార్స్‌ సంస్థ భారత్‌ లో కార్యకలాపాలు మూసేసింది. అమ్మకాలు ఆపేసింది. దీంతో ఆ కార్లు పరిస్థితి ఇబ్బందిగానే మారింది. అందుకే మార్కెట్లో విజయవంతమైన కారు మాత్రమే కొనండి.. లగ్జరీ కోసం లేదా.. సంపన్నులు ఫీచర్స్‌ కోసం ఏ మోడల్‌ అయినా కొనే అవకాశం ఉంది. కానీ మధ్యతరగతి వాళ్లు తమ జీవితకాలంలో కొనే కారు ఒక్కటే అయి ఉంటుంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Recommended For You