సాంబ‌శివ.. వ్యూహాల‌కు కేరాఫ్‌

సాంబ‌శివ‌రావు.. ఈ పేరు ఏపీలో మార్మోగుతోంది. వాస్త‌వానికి ఆయ‌న ఎంత సైలెంట్‌గా కనిపిస్తారో… అంత వైలెంట్ ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళ‌తారు. మాట‌ల్లో దూకుడు చూపించే మ‌నిషి కాదు.. చేత‌ల్లో చూపిస్తాడు. మాట‌ల‌తో మ‌ట్టిక‌రిపిస్తాడు. అదే ఆయ‌న స్టైల్‌. ఆయ‌నే డీజీపీ సాంబ‌శివ‌రావు. సాంబ‌శివ‌రావుకు ఓ స్టైల్ ఉంది. ఆయ‌న ప‌లానా పోస్టు కావాలి.. అదే చేస్తాను అనే ర‌కం కాదు. ఇచ్చిన బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్దవంతంగా నిర్వ‌హించ‌డ‌మే తెలుసు. ఒక‌ప్పుడు విశాఖప‌ట్నం క‌మీష‌న‌ర్‌గా చేసినా.. ఆ త‌ర్వాత రాష్ట్రస్థాయి పోస్టుల్లో లూప్‌లో ఉంచినా త‌న‌దైన మార్కు చూపిస్తారు. ప‌నిష్మెంట్ అని అనుకునేవాళ్లే.. ప‌నిత‌నం చూపించ‌డానికి అంతుందా అనేంత‌గా అందులో లీన‌మైపోతారు. ఎంత విన‌యంగా క‌నిపిస్తారో.. అంత క‌సిగా ప‌నిచేస్తారు.

సాంబ‌శివ‌రావును కేవ‌లం మావోయిస్టు ఎన్‌కౌంట‌ర్ ఆధారంగా స‌మ‌ర్ధుడు అని చెప్ప‌డం లేదు. ఆయ‌న గ‌తంలో ప‌నిచేసిన పోస్టులు కూడా ఇందుకు కార‌ణం. విశాఖ క‌మీష‌న‌ర్‌గా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఇప్ప‌టికీ అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఉండిపోయాయి. మ‌రెవ‌రూ కూడా ఆయ‌న స్థాయిని అందుకోలేక‌పోయారు. విశాఖ న‌గ‌రంలో కూడా ఆయ‌న హ‌యాంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. అది మావోయిస్టుల‌ది కాదు.. ముగ్గురు దొంగ‌ల‌ది. నేరస్తులను ఎంత భయపడతారో.. జనాల్లో అంతగా కలిసిపోతారు. సుందరతీరంలో ఆఫీసర్ క్లబ్ లో ఉన్న నండూరి హాల్ చెబుతుంది. అప్పుడే ఎదుగుతున్న విశాఖకు అధ్బుతమైన పోలీసింగ్ ను తీర్చిదిద్దారు. ఇక ఆర్టీసీ ఛైర్మన్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు సంస్థను లాభాల బాట పట్టిస్తున్నాయి. కొత్తగా సంస్కరణలు తీసుకొచ్చి వాటికి మెరుగులు అద్దుతున్నారు. పోలీస్ బాస్ గానే కాదు.. నాయకత్వ లక్షణాలతో ఆర్టీసీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారు. డీజీపీ అయినా ఆయన నుంచి బాధ్యతలు తీసుకోవడానికి చంద్రబాబు ఇష్టపడకపోవడానికి కారణం అదే. నిజాల‌ను నిర్భ‌యంగా చెబుతారు. వ్యూహాలు ప‌క్కాగా అమ‌లు చేస్తారు. మైకుల ముందుకు వ‌స్తారు. ఒక్కోసారి మీడియాను కూడా త‌న‌దైన ప్ర‌శ్న‌ల‌తో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తారు.

పోలీసుల బాధ్యత శాంతిభద్రతలే కాదు.. సామాజిక సేవ కూడా అంటూ పుష్కరాల్లో చూపించారు. వాలంటీర్లుగా వ్యవహరించి అందించిన పోలీసుల సేవలు సెభాష్ అనిపించాయి. పోలీసుల ఆరోగ్యానికి కీలక చర్యలు తీసుకుంటున్నారు. వారి సదుపాయాలు సమకూర్చుతున్నారు. ఏ విధంగా చూసినా వారేవా గ్రేట్ సాంబ అనిపించుకుంటున్నారు.

Recommended For You

Comments are closed.