డేటా వ్యవహారంలో విషయంలో జగన్ పాచిక పారిందా?

Regional

డేటా వ్యవహారంలో రాజకీయంగా పెద్దది చేసి చూపిస్తున్నారా? రాజకీయరాద్దాంతం వెనక పక్కా స్కెచ్‌ ఉందా? ఇదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఇటీవల చంద్రబాబు సంక్షేమ పథకాలతో జోరుమీదన్నారు. అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకమ, పెన్షన్ల పెంపు సహా పలు పథకాలతో ప్రభుత్వం ఇమేజ్‌ పెరుగుతూ వస్తోంది. నియోజకవర్గాల్లో జనాలను పథకాలు ఆకట్టుకుంటున్నాయి. ఎన్నికల ముందు లబ్ధిదారులంతా ఓట్లుగా మారతారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరణంలో డేటా వ్యవహారం బ్రేకులు వేసిందా? జగన్‌ తరుపున రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలో డేటా రాద్దాంతానికి తెరతీసినట్టు కనిపిస్తుంది.
For Video:

సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరు, పోలవరం, అమరావతి అంశాలు పక్కదారి పట్టించేలా.. చర్చంతా ఓటరు లిస్టులు, డేటాల చుట్టూ తిరిగేలే వైసీపీ స్కెచ్‌ వేసినట్టు కనిపిస్తోంది. ఇదంతా పద్దతిప్రకారం.. పక్కాగా వైసీపీ ప్లానులాగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం ఉండడంతో మరింత ఆసక్తిగా మారింది. మొత్తం రాజకీయ చర్చను డేటా, ఓటరులిస్టుల వైపుగా విజయవంతంగా మళ్లించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలపై చర్చ పక్కదారి పట్టింది. ఎన్నికల వరకూ ఇదే రచ్చ సాగేలా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకోవడం వైసీపీకి మరింత అనుకూలంగా మారనుంది. అయితే టీడీపీ నాయకత్వంపైనా తమ్ముళ్లలో కొంత అసంతృప్తి ఉంది. డేటా వ్యవహారంలో టీడీపీ అతిగా స్పందించడం కూడా చర్చను మరింత పెద్దదిగా చేసిందంటున్నారు. వైసీపీ ట్రాపులో పడినట్టుగా ఉందని భావిస్తున్నారు. అంత సీరియస్‌ గా తీసుకోకుండా.. తర్వాత న్యాయస్థానాల్లో తేల్చుకుంటే సరిపోయేదని అంటున్నారు. మొత్తానికి ఈ వివాదంలో సీరియస్‌ ఎంతున్నా.. దీని వల్ల టీడీపీ తన పథకాలను, సంక్షేమం జనాల్లోకి తీసుకళ్లలేని పరిస్థితి ఉంది. దీన్నుంచి టీడీపీ బయటపడాల్సిన అవసరం ఉంది. లేదంటే నష్టం తప్పదంటున్నారు.