అందుకే ఆస్తుల‌పై దాసరి గోప్య‌త పాటించారా..?

దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణం ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. పెద్దాయ‌న‌గా అంద‌రి వివాదాల‌ను ప‌రిష్క‌రించిన ద‌ర్శ‌క‌ర‌త్న లేడంటే చిన్న నిర్మాత‌ల‌కు క‌ష్ట‌మే. ఆయ‌న్ను ఎవ‌రు విబేధించినా.. మళ్లీ ఆయ‌న‌ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే. మ‌రి అలాంటి పెద్దాయ‌న ఆస్తులు కూడా వివాదంగా మారుతున్నాయా? ఆయ‌న కుటుంబంలో క‌ల‌త‌ల‌కు ఆస్తులు కార‌ణం కానున్నాయి. ఇదే ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు దారితీస్తోంది. దాస‌రికి ఆస్తులు బాగానే ఉన్నాయి. సిరీ మీడియా హౌస్ భ‌వ‌నం.. ఇప్పుడు ఉండే ఇల్లుతో పాటు.. ఫాంహౌస్‌, పాల‌కొల్లు, చెన్నైల‌లో ఆస్తులు ఉన్నాయ‌ట‌. వివిధ కంపెనీల్లో షేర్లు, డైరెక్ట‌ర్ హోదాలో ఉన్నారు. అయితే వార‌సులైన తార‌క ప్ర‌భు, అరుణ్‌కుమార్‌లపై పెద్ద‌గా విశ్వాసం లేని దాస‌రి తన ఆస్తులు.. వారికి అప్ప‌గించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారట‌. గ‌తంలో త‌లెత్తిన వివాదాల నేప‌థ్యంలో కూడా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈయ‌న చివ‌రి రోజుల్లో కూడా దీనిపై పెద్ద‌గా ఆలోచించ‌లేద‌ని స‌న్నిహితులు అంటున్నారు. తాను బ‌తికుండగానే పంప‌కాలు పెడితే వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకుని వీలునామాపై గోప్య‌త పాటించిన‌ట్టు తెలుస్తోంది. అయితే వీలునామా రాశారా, లేదా అన్న‌ది అంతుచిక్క‌డం లేద‌ట‌. గ‌తంలో జ‌య‌ల‌లిత వీలునామా వ్య‌వ‌హారం ఎంత‌గా సంచ‌ల‌నం సృష్టిస్తుందో తెలుసుగా.. ఆమె చ‌రిత్ర‌ను సినిమాగా తీయాల‌నుకున్న దాస‌రి తన ఆస్తులపై జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటారా? ఇప్ప‌టికే పెద్ద‌కోడ‌లు తెర‌మీద‌కు వ‌చ్చారు.. ఆయ‌న మ‌ర‌ణంపైనే అనుమానాలు వ్య‌క్తం చేశారు. అయితే త‌న త‌ద‌నంత‌రంగా ఆస్తులు కుటుంబ స‌భ్యుల‌కు స‌మానంగా పంచ‌మ‌ని పెద్ద‌ల‌కు ముందే చెప్పిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఏది నిజ‌మో?

Recommended For You

Comments are closed.