ఆ పార్టీ మ‌ళ్లీ అమ్ముడుపోయిందా..?

ఖ‌మ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర స‌మితి బ‌ల‌హీనంగా ఉంద‌న్న వాస్త‌వం గుర్తించిన టిఆర్ఎస్… ఎలాగైనా గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌గా ఉంది.. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స‌హా కీల‌క నేత‌లంతా గులాబీ గూటికి చేరినా..పార్టీకి అనుకున్న స్థాయిలో కేడ‌ర్ బ‌లం లేకుండా పోయింది. ఓట్లు చీల్చి త‌మ‌కు ర‌హ‌స్యంగా స‌హ‌క‌రించే పార్టీల‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీపీఎంతో అంత‌ర్గ‌తంగా ఒప్పందం చేసుకుంద‌న్న ప్ర‌చారం జిల్లాలో జోరుగా సాగుతోంది. నాయకుల విమర్శలే కాదు.. సీపీఎం కు చెందిన ఆ నాయకుడి గురించి తెలిసిన ప్రతిఒక్కరూ రహస్య ఒప్పందమే అని నిర్మోహ మాటంగానే చెబుతున్నారు. వామ‌ప‌క్షాలు సొంతంగా గెలిచే స‌త్తా లేదు.. పొత్తులు పెట్టుకుని పోటీచేస్తే ఒక‌టి రెండు సీట్లు రావ‌డానికి ఆస్కారం ఉంది. కానీ సీపీఎం పొత్తులు వ‌ద్ద‌ని…కూట‌మికి వ్య‌తిరేకంగా ఒంట‌రిగానే పోతామ‌ని చెప్ప‌డం వెన‌క కేసీఆర్ తో ఒప్పందంపై జిల్లాలో ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో కూడా సీపీఐ నారాయ‌ణ పోటీచేసినా.. స‌హ‌క‌రించ‌కుండా.. సొంతంగా పోటీచేసి బోర్లాప‌డ్డ సీపీఎం మ‌ళ్లీ అదే పొర‌పాటు చేస్తుందంటున్నారు. జాతీయ‌స్థాయిలో మోడీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ తో సీపీఎం స‌హా వామ‌పక్షాలు స‌హా అంతా క‌లిసిక‌ట్టుగా పోటీకి సిద్ద‌మ‌వుతుంటే… అదే బీజేపీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న కేసీఆర్ ను ఢీకొట్ట‌డానికి ఏర్ప‌డుతున్న కూట‌మికి ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సీపీఎం తీసుకుంటున్న నిర్ణ‌యం ఓ వ్య‌క్తి త‌న స్వార్ధం కోసం… తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో జరిగిన ఒప్పందంలో భాగంగా పోటీలో ఉండి.. ఓట్లు చీల్చి గెలిపించ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నంగా చెబుతున్నారు. సొంత పార్టీ నాయ‌కులు కూడా ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నా.. ఆ నాయ‌కుడికి చెప్పేప‌రిస్థితి లేదు. గ‌తంలో నాయ‌కుడు అమ్ముడు పోయారంటూ సీపీఐ నాయ‌కుడు నారాయ‌ణ సాక్షాత్తూ విమ‌ర్శించారు.. ఆప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌ని జిల్లాలో ఏ కార్య‌క‌ర్త‌ని అడిగినా ఆరోపిస్తున్నారు.. ఇందులో నిజం ఉందో లేదో కానీ… ప్ర‌చారం మాత్రం జ‌రుగుతోంది. వాస్త‌వానికి పార్టీకి ఓట్లు-సీట్లు పెర‌గాలంటే పొత్తులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.. కానీ ఒంట‌రిగా పోటీచేసి ప‌రువు పోగొట్టుకోవ‌డ‌మే అవుతుంది.. సున్నం రాజ‌య్య కూడా పోటీకి ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఏపీకి వెళ్లిపోతున్నారు. ఓ నాయ‌కుడు త‌న స్వార్ధం కోసం కొంత‌మంది అభ్య‌ర్ధుల‌ను ప్ర‌తిసారీ పోటీలో పెట్టి బ‌లిప‌శువును చేస్తున్నార‌న్న విమ‌ర్శా లేక‌పోలేదు. కేసీఆర్ పాల‌న నియంతృత్వ పాల‌న అంతం కావాల‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి… బ‌హుజ‌న లెఫ్ట్ ఫ్రంట్ అంటున్న నాయ‌కుడు… అదే కేసీఆర్ పై వ్య‌తిరేక ఓటు చీల‌కుండా కూట‌మికి ఎందుకు స‌హ‌క‌రించ‌డం లేదో స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

Recommended For You