చంద్ర‌బాబు వ‌ద్ద‌కు కాంగ్రెస్ నేత భట్టి రాయభారం..!

టీడీపీ- కాంగ్రెస్ మ‌ధ్య అవ‌గాహ‌న కుదురుతుంద‌న్నప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌నలు సృష్టిస్తోంది. శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు కాబ‌ట్టి ఇందులో నిజం ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మోడీ శ‌త్రువుగా మారిన‌ప్పుడు రాహుల్ గాంధీతో క‌లిసిపనిచేయ‌డంలో త‌ప్పే లేద‌న్న భావ‌న చంద్ర‌బాబుకు వ‌చ్చి ఉంటుంది. ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో గ‌ట్టు దాటాలంటే క‌లిసివ‌చ్చే ప్ర‌తిఅంశాన్ని అనుకూలంగా మ‌లుచుకోవాలి. ప్ర‌తిప‌క్షం వైసీపీ ఓట్లు చీలి త‌మ‌కు ప‌రిస్థితులు అనుకూలంగా మారాలంటే.. కొద్దో గొప్పో కాంగ్రెస్ బ‌ల‌ప‌డాలి. ఆ పార్టీకి ఉన్న ఓటుబ్యాంకు ఎంతోకొంత వైసీపీ నుంచి తిరిగి రావాలి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ వ్యూహాలూ కూడా చంద్ర‌బాబే ఖ‌రారు చేస్తున్నార‌న్న‌ది జ‌గ‌న్ ఆయ‌న పార్టీ ఆందోళ‌న‌. కాంగ్రెస్ – టీడీపీ ల మ‌ధ్య క్విడ్ ప్రో కో న‌డుస్తుంద‌ని వారి అనుమానం. ఇది వాస్త‌వం కూడా అయి ఉండొచ్చు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెల‌వాలంటే టీడీపీ సాయం కావాలి. ఏపీలో టీడీపీకి లాభం క‌ల‌గాలంటే కాంగ్రెస్ యాక్ష‌న్ క‌నిపించాలి. అందుకే ఇద్ద‌రూ అండ‌ర్ స్టాండింగ్ కు వ‌చ్చారట‌. అయితే ఈ మంత్రాంగం అంతా జ‌రిపేది తెలంగాణ‌కు చెందిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్కు. రాహుల్ ధూత అయిన కొప్పుల రాజు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో భ‌ట్టి అమ‌లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల చంద్ర‌బాబును భ‌ట్టి క‌లిసిన త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ యాక్ష‌న్ మొద‌లుపెట్టింది. కిర‌ణ్ కుమార్ రెడ్డి చేరిక‌తో పాటు.. భ‌విష్య‌త్తులో మ‌రికొంత‌మంది నాయ‌కులు కూడా కాంగ్రెస్ గూటికి చేర‌తారు. వీరంతా త‌మ వ్య‌క్తిగ‌త శ‌క్తియుక్తులు, టీడీపీ ప‌రోక్ష సాయంతో వైసీపీ ఓటుబ్యాంకుకు గండికొడ‌తారు. ఇది అధికార టీడీపీకి అనుకూలంగా మారుతుంది. ఇది వారి మ‌ధ్య అవ‌గాహ‌న ర‌హ‌స్యం. అయితే టీడీపీ-కాంగ్రెస్ మ‌ధ్య‌ నేరుగా పొత్తు ఉండ‌దు.. ఉన్నా తెలంగాణ‌కు ప‌రిమితం చేస్తారు.. ఏపీలో ర‌హ‌స్య మిత్రులుగానే ఉంటార‌న్న‌ది ప్ర‌ధానంగా వినిపిస్తున్నవాద‌న‌. ఏమైనా చంద్ర‌బాబు చాణ‌క్యం ఎవ‌రైనా ఒప్పుకోవాల్సిందే.

Recommended For You