త్వరలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గోవిందా?

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కారెక్కనున్నారు. ఈనెల 24న టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరు ముగ్గురు పార్టీలో చేరితే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరుతుంది.టిఆర్ ఎస్ సెంచరీ నాటౌట్ అంటోంది.. మరి ఇన్నింగ్స్ ఎంతకాలం సాగుతుందో చూడాలి.

Best Food Lovers Watch Video:

Recommended For You