ఖమ్మం కమీషనరేట్ సాకారం..!

ఖమ్మం కమీషనరేట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే కమీషనరేట్ సాకారం కానుంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరాల్లొ ఒకటిగా ఉన్న ఖమ్మం త్వరలో అధికారికంగా కమీషనరేట్ స్థాయికి మారనుంది. దీంతో నగరంతో పాటు.. చుట్టుపక్కల మండలాలను కూడా దీని పరిధిలోకి తీసుకొస్తారు.  కమీషనర్ ఉండడం వల్ల శాంతిభద్రతలు పెరుగుతాయి. సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారు. ట్రాఫిక్, ఇతర విభాగాలు మరింత పటిష్టం చేస్తారు. దీంతో పాటు.. ఖమ్మం రూరల్ ఎస్పీ కార్యాలయం కూడా ఉంటుంది. సోమవారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ బిల్లును ప్రవేశపెట్టారు. వాస్తవానికి మొన్ననే సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల కమీషనరేట్లతో కలిపి బిల్లులో చేర్చాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలతో రాలేదు. దీంతో తుమ్మల దగ్గరుండి బిల్లు సిద్దం చేయించినట్టు తెలుస్తోంది.

Recommended For You

Comments are closed.