కోర్టు తీర్పులు కాద‌ట‌.. నోట్లే అస‌లు స‌మ‌స్య‌ట‌..!

సంక్రాంతి సీజ‌న్ వ‌చ్చేస్తోంది.. పండ‌గ రాయుళ్లు అంతా గోదావ‌రి జిల్లాల బాట ప‌డుతున్నారు. పందెం కోళ్లు క‌త్తులు క‌ట్టుకుని క‌య్యానికి కాలుదువ్వుతున్నాయి. అయితే సోమ‌వారం హైకోర్టు కోడి పందేల‌ను నిషేదిస్తూ తీర్పు చెప్పింది. జీవ‌హింస‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అటు పోలీసులు కూడా కోడి పందేల‌పై క‌న్నేశారు. 325 మంది కేసులు పెట్టిన‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే పందెం రాయుళ్ల‌ మాత్రం ఇవేమీ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా లైట్‌గా తీసుకుంటున్నారు. తీర్పులు తీర్పులే.. మా ప‌ని మాదే అంటున్నారు. కోర్టు తీర్పు కాదు గానీ అంత‌కంటే పెద్ద చిక్కే వచ్చింద‌ట‌..అది ఎలా అధిగ‌మించాలో అర్ధం కావ‌డం లేదట‌. అదే మోడీ నోట్లు ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం. చేతిలో డ‌బ్బులు లేవు.. పందెం ఎలా కాయాలా అంటూ ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. ఒక‌వేళ పందెంలో గెలిచినా డ‌బ్బులు వేస్తార‌ని గ్యారెంటీ లేదు. వేసినా.. ఇంత పెద్ద మొత్తం ఎక్క‌డ నుంచి వ‌చ్చిందంటూ ఐటీ శాఖ నిఘా. ఇదెక్క‌డి గోల‌రా అంటూ భారీగా పందేలు కాసే వాళ్లంతా గొళ్లుమంటున్నారు. వంద‌ల కోట్లు చేతులు మారుతుంటాయి. గ‌త ఏడాది దాదాపు 5వంద‌లు కోట్లు చేతులు మారిన‌ట్టు అంచ‌నా. ఇది ఈ ఏడాది పెరుగుతుంద‌ని భావించారు. కానీ అనూహ్యంగా నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌తో ప‌డిపోతుంద‌ని అంచ‌నాల్లో ఉన్నారు. మ‌రి మామిడి, అర‌టి తోట‌లు ఈ సారి ఎలా ఉంటాయో చూడాలి.

Recommended For You

Comments are closed.