రేవంత్ రెడ్డి ఇంట్లో భోజ‌నానికి కేసీఆర్‌…!

తెలుగుదేశం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ముందుంటారు. ఒక్కోసారి హ‌ద్దులు మీరి వ్య‌క్తిగ‌త కామెంట్లు చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. రాజ‌కీయంగా ఇద్ద‌రికి బ‌ద్ద‌వైరం ఉంది. ఓటుకు నోటు కేసు త‌ర్వాత ఇది మ‌రింత పెరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ద‌శాబ్ధాల క్రితం సిఎంలు ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇంటికి వెళ్లి భోజ‌నాలు చేసి.. రాష్ట్ర ప్ర‌గ‌తిపైనా, తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పైనా మంచి చెడు మాట్లాడుకునేవారట‌. అదే సంప్ర‌దాయం తాను కూడా మొద‌లుపెట్టాల‌ని నిర్ణ‌యించారట‌. అయితే లేని పోని అపోహ‌లు వ‌స్తాయ‌ని ఆగిన‌ట్టు కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. మొత్తానికి త‌న మ‌న‌సులో మాట మాత్రం స‌రైన సంద‌ర్భం రావ‌డంలో బ‌య‌ట‌పెట్టారు సిఎం. మ‌రి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ఇళ్ల‌కు పోతాన‌న్న సిఎం బీజేపీ ప‌క్ష‌నేత కిష‌న్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఇళ్ల‌కు వెళ్ల‌డానికి ఇబ్బంది ఉండ‌క‌వ‌పోచ్చు. మ‌రి టీడీపీ ప‌క్ష నేత రేవంత్ రెడ్డి ఇంటికి వెళ‌తారా.. ఛాన్సే లేదంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత ఇంటికి మాత్ర‌మే అన్నార‌ని.. అంద‌రి ఇళ్ల‌కు వెళతాన‌ని చెప్ప‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ల‌క‌పోయినా.. జానారెడ్డి ఇంటికి పోయినా కేసీఆర్ కొత్త సంస్కృతికి, స‌త్సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్టేన‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. ఆలోచ‌న వ‌స్తే మా కేసీఆర్ ఆగ‌ర‌ని.. ఖ‌చ్చితంగా వెళ‌తార‌ని అంటున్నారు. సో.. త్వ‌ర‌లోనే సాకారం కావాల‌నుకుందాం,…

Recommended For You

Comments are closed.