అగ్నికి ఆజ్యం పోస్తున్న చైనా?

భార‌త్ – పాక్ మ‌థ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఉంది. ఎప్పుడు ఏ యుద్ధం జ‌రుగుతుంతో అని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. స‌రిగ్గా ఈ స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటించాల్సిన చైనా మ‌రింత ఆజ్యం పోస్తోందా? అవును తాజాగా ఆ దేశ అధికారిక ప‌త్రిక ఇచ్చిన క‌థ‌నాలు యావత్ ప్రపంచాన్ని కంగారు పుట్టిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో అణ్వాయుధాలు మోహ‌రించ‌డానికి భార‌త్ కుట్ర చేస్తుందంటూ  తాజాగా క‌థ‌నాలు రాసింది. ఇటీవ‌ల ర‌ఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వెన‌క కార‌ణమిదేనని అంటోంది. ర‌ఫేల్ విమానాలు అణ్వాయుధాల‌ను తీసుకెళ్లి టార్గెట్ చేయ‌గ‌ల‌వు. వాటిని కేవ‌లం పాకిస్తాన్, చైనా ల‌క్ష్యంగా భార‌త్ కొనుగోలు చేసిన‌ట్టు చైనా ఆరోపిస్తోంది. అస‌లే స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు ఉన్నాయి. ప‌ర‌స్ప‌ర దాడులు జ‌రుగుతున్నాయి. దేశ మంతా హైఅలెర్ట్ ప్ర‌క‌టించారు. ఈ స‌మ‌యంలో అటు పాకిస్తాన్‌ను రెచ్చ‌గొట్టే విధంగా చైనా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న అభిప్రాయం ఉంది. మొద‌టి నుంచి భార‌త్‌కు వ్య‌తిరేకంగా చైనా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్పుడు ఈ క‌థ‌నాల‌తో రెచ్చ‌గొడుతోంది. భార‌త్ ఆయుధాలు కొనుగోలు చేయ‌డానికి చైనాపై దుష్ఫాచారం చేస్తున్నార‌ని కూడా ఆ దేశం ఆరోపించింది. తాజా క‌థ‌నాల‌పై ప్ర‌పంచ‌దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఉన్న స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు స‌రికాద‌ని గుర్తు చేశాయి.

Recommended For You

Comments are closed.