పాకిస్తాన్ పాపాల‌కు చైనా మ‌ద్ద‌తు

పాకిస్తాన్ ఉగ్ర‌వాద కుట్ర‌లకు వ్యతిరేకంగా ప్ర‌పంచం మొత్తం ఏక‌మైనా చైనాకు మాత్రం అవేమీ క‌నిపించ‌డం లేదు. తాజాగా మ‌రోసారి పాకిస్తాన్‌కు అనుకూలంగానూ భార‌త్‌కు వ్య‌తిరేకంగా కుట్ర‌లకు తెర‌తీసింది. తాజాగా ఐక్య‌రాజ్య‌స‌మితిలో పాకిస్తానీ తీవ్రవాద నేత మ‌సూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్ర‌క‌టించ‌కుండా అడ్డుకుంది. మూడు నెల‌ల పాటు ఈ క‌రుడుగ‌ట్టిన తీవ్ర‌వాదిపై నిషేధం విధించ‌కుండా అడ్డుపుల్ల వేసింది. ఐక్య‌రాజ్య‌స‌మితిలోని భ‌ద్ర‌తా కౌన్సిల్‌లో స‌భ్య దేశం అయిన చైనా మ‌రోసారి త‌న ద్వంద‌నీతిని చాటుకుంది. ప్ర‌పంచం అంతా పాకిస్తాన్‌ను దుమ్మెత్తి పోస్తున్నా.. చైనా మాత్రం ముద్దాడుతూ ఇంకా తీవ్ర‌వాదుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌సూద్ అజార్ జేషేహ‌హ్మ‌ద్ తీవ్ర‌వాద సంస్థ‌ను న‌డిపిస్తున్నాడు. ఉగ్ర‌శిక్ష‌ణ ఇచ్చి భార‌త్‌కు వ్య‌తిరేకంగా ఆత్మాహుతి ద‌ళాల‌ను పంపుతున్నాడు.

చైనా కాపాడుతున్నా.. విదేశాల్లో స్థిర‌ప‌డ్డ పాకిస్తానీయులే భార‌త్ చ‌ర్య‌లను స్వాగ‌తిస్తున్నారు. పాకిస్తాన్‌కు పిఎం న‌వాజ్ ష‌రీఫ్ కాద‌ని.. ల‌ష్క‌ర్ ఈ తోయిబా న‌డిపిస్తున్న హ‌ఫీజ్ స‌యీద్ అసలు ప్రధాని అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దేశాన్ని నాశ‌నం చేస్తున్నా రాజ‌కీయ నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. భార‌త్‌కు వ్య‌తిరేకంగా వెళ్లినంత కాలం పాకిస్తాన్ బాగుప‌డ‌ద‌ంటున్నారు. కెనడాలో స్థిర‌ప‌డ్డ పాకిస్తానీ తెహర్ అనే ర‌చ‌యిత త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాకిస్తాన్లో ప్ర‌జాస్వామ్యం అప‌హ‌స్యం చేశార‌న్నారు. తీవ్ర‌వాదుల చేతిలో పెట్టి దేశాన్ని న‌డిరోడ్డుపై నిల‌బెట్ట‌రన్నారు. ఇప్ప‌టికైనా స‌రిహ‌ద్దు దేశంతో స‌త్సంబంధాల‌కు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు. పాకిస్తాన్‌కు ఇత‌ర దేశాల నుంచే కాదు.. విదేశాల్లో స్థిర‌ప‌డ్డ ఆ దేశ పౌరులు కూడా విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. భ‌విష్య‌త్తులో దేశ ప్ర‌జ‌లు కూడా పాలకులపై తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఎదురుతిరిగే అవ‌కాశం ఉంది. మరి పాక్ బుద్ది తెచ్చుకుంటుందా?

Recommended For You

Comments are closed.