ధోనీ సినిమాలో చ‌ర‌ణ్ ?

Ram charan acting as cricketer Suresh raina

బాలీవుడ్‌లో సంచ‌న‌లం సృష్టిస్తున్న ఎంఎస్ ధోనీ చిత్ర ఇప్పుడు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి స‌రికొత్త విష‌యం ఒక‌టి తెలుస్తోంది. ఇందులో ధోనీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్నక్రికెటర్‌ల‌లో ఒక‌రు సురేష్ రైనా. ఆ పాత్ర‌కు తెలుగు మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ పోషించిన‌ట్టు తెలుస్తోంది. కొద్ది సేపు మాత్ర‌మే ఉండే ఈ పాత్ర‌కు చ‌ర‌ణ్ చేత చేయించిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ సీక్రెట్‌గా ఉంచింది. ఈ నెల 30న సినిమా విడుద‌ల చేస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ పాత్ర‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే ర‌హస్యంగా ఉంచిన‌ట్టు తెలుస్తోంది.

ఇక విరాట్ కోహ్లీ పాత్ర‌ను పాక్ నుంచి వ‌చ్చి బాలీవుడ్‌లో రాణిస్తున్న ఫ‌వాద్ ఖాన్ పోషించిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమా ట్రైల‌ర్స్‌లో ఎక్క‌డా కూడా చ‌ర‌ణ్ కానీ ఇత‌ర ప్ర‌ముఖు తార‌లు కానీ క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. హీరోగా చేసిన రాజ్‌పుత్ సుశాంత్ మాత్ర‌మే ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ధోనీకే కేవ‌లం 80 కోట్లు చెల్లించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ధోనీ కూడా దీనికి త‌గ్గ‌ట్టే ప్ర‌మోష‌న్‌లో క‌ష్ట‌ప‌డుతున్నాడు. త‌మిళ‌, తెలుగు, హిందిభాష‌ల్లో చిత్రం విడుద‌ల అవుతోంది.

Recommended For You

Comments are closed.