చంద్రబాబు వర్సెస్ సీఎస్.. పంతం నీదా?నాదా?

చంద్రబాబునాయుడికి సీఎస్‌ సుబ్రహ్మణ్యంకు మధ్య వార్‌ మరింత ముదురుతోందా..? కేబినెట్‌ వ్యవహారంలో చంద్రబాబు పంతం నెగ్గుతుందా… సీనియర్‌ అధికారి తన మాట నెగ్గించుకుంటారా? 10వ తేదీన చంద్రబాబునాయుడు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎజెండా సిద్దం చేయాలని సిఎస్‌ ను ఆదేశించారు. అయితే సీఎస్‌ ఇందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలను సీఎస్‌ లైట్‌ గా తీసుకున్నారని సమాచారం. ఎన్నికల సంఘం నియమించిన తాను కోడ్‌ ఉన్నందున స్వతంత్రంగా వ్యవహరిస్తానని.. సీఎంతో సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం తాను సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేసినప్పడు ఖచ్చితంగా అమలుచేయాల్సిందేనని అంటున్నారు. ఆపద్దర్మ సీఎం అంటూ ఏమీ రాజ్యాంగంలో లేదని… కొత్త ప్రభుత్వం వచ్చేవరకు సీఎం తానేనని అంటున్నారు. గతంలో కేసీఆర్‌ కూడా ఇదే తరహాలో తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అంటున్నారు. అధికారులను పాలన చేయమని ఏ చట్టంలో మరే రాజ్యాంగంలో లేదని… రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి మండలి ఆదేశాల మేరకు కొన్ని వ్యవస్థలను మాత్రమే అధికారుల పాలనలో ఉంటాయని గుర్తు చేస్తున్నారు. మొత్తం ప్రభుత్వాన్నే అధికారులు నడపలేరని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు మినహా అధికారులకు ఎలాంటి అధికారాలు ఉండవన్నారు. ఇప్పుడు తాము చెప్పింది చేయాల్సిందేనని అంటున్నారు చంద్రబాబు. మొత్తానికి 10 వతారీఖు కేబినెట్‌ సమావేశానికి సీఎస్‌ సుబ్రహ్మణ్యం స్పందించకపోతే ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీఎంపై పలుమార్లు విభిన్న వ్యాఖ్యలు చేసిన సబ్రహ్మణ్యం సీఎం ఆదేశాలకు స్పందిస్తారా? కేబినెట్‌ ఎజెండా సిద్దం చేస్తారా? సిఎస్‌ ఎజెండా సిద్దం చేయకుండా ఆయన లేకుండా  మంత్రిమండలి సమావేశం నిర్వహించడం సాధ్యం కాదు.. మరి ఆయన స్పందించకపోతే సీఎం ఏం చేయాలి? ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటుందా? రాష్ట్రపతి, గవర్నర్‌ దీనిపై స్పందించేఅవకాశం ఉందా? చూడాలి.
Watch Video

Recommended For You