చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఎపీ సీయం చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
ఏపి సిఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశం. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ధర్నా చేసేందుకు వెల్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదు. ఎనిమిది సంవత్సరాలగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం పట్ల అనుమానాలు. తిరుమల శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు తెలుసుకున్న చంద్రబాబు.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీయం చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పు బడుతున్న తెలుగు దేశం నేతలు. చంద్రబాబుపై వారెంట్ జారీ కావడంతో ఎపీలో మరోసారి వేడెక్కనున్న రాజకీయాలు. నారా చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, టి .ప్రకాష్ గౌడ్, నక్కా ఆనంద బాబు, గంగుల కమలాకర్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, జి.రామానాయుడు, సి.హెచ్.విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింభు

Recommended For You