హార్టీకల్చర్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నజిల్లా అనంతపురమే..!

గత నాలుగున్నరేళ్లలో రైతులకు విత్తన, విద్యుత్‌, నీటి భద్రత కల్పించి వారి ఆదాయాన్ని 97 శాతం రెట్టింపు చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. బుధవారం సమగ్ర వివరాలతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. దేశంలో సూక్ష్మసేద్యం కింద అత్యధికంగా సాగు చేస్తున్న టాప్ టెన్ జిల్లాల్లో ఆరు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయన్నారు. హార్టీకల్చర్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నజిల్లా అనంతపురం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హార్టీకల్చర్ రాష్ట్రంలో విస్తారంగా సాగవుతోందన్నారు. వ్యవసాయంలో 11 శాతం వృద్ధితో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఐదేళ్లు వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయంలో వృద్ధి సాధించాము. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టాము. 2013-14లో రూ.6,128 కోట్లు ఉన్న వ్యవసాయ బడ్జెట్‌ను 2018-19 నాటికి రూ.19,070 కోట్లకు పెంచామన్నారు.

Also: కేసీఆర్ మోడీ సమావేశంపై చంద్రబాబు రియాక్షన్

Recommended For You