చంద్ర‌బాబు జీవితంలో అతిపెద్ద సంక్షోభం ఇదేన‌ట‌..!

మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్ర‌బాబుకే స‌వాలుగా మారింద‌ట‌. త‌న‌ముందున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరక్క స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. ఇంత‌కీ ఆయ‌న ముందున్న స‌వాల్ ఏంటో తెలుసా.. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డం. ముందుగా స‌మ‌ర్ధించినా.. త‌ర్వాత పరిణామాలు ప్రతికకూలంగా మారాయంటున్నారు. దీనికి కార‌ణం బ్యాంకింగ్ వ్య‌వ‌స్థేన‌ట‌. మోడీ నిర్ణ‌యం తీసుకున్నా.. అమ‌లు చేయాల్సిన యంత్రాంగం వైఫ‌ల్యంతో పెను సంక్షోభం తెలెత్తిందని చంద్ర‌బాబు అన్నారు. టీడీపీ నాయ‌కుల‌తో నిర్వ‌హించిన వ‌ర్కుషాపులో డిమానిటేజైషన్‌పై అరగంట‌కు పైగా చంద్ర‌బాబు మాట్లాడారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత ప‌రిణామాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌నీసం పెన్ష‌న్లు ఇచ్చే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింద‌న్నారు. బ్యాంకులు దారుణంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని.. స‌మ‌ర్ధ‌త లేని బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ వ‌ల్ల జ‌నాలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. డిజిట‌ల్ చేద్దామంటే అందుకు త‌గ్గ మౌలిక వ‌స‌తులు లేవ‌ని.. బ్యాంకులు కూడా సహకరించడం లేదని.. దీంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదని చంద్ర‌బాబు ఆవేద‌న‌గా చెప్పారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను అనుగుణంగా ముందస్త జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే భ‌విష్య‌త్తులో దేశం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న హెచ్చరిస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర ఆర్ధిక వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌న్నారు. ఆదాయం ప‌డిపోతుంద‌న్నారు. ‘‘ఎన్టీఆర్ నుంచి అధికార మార్పిడి జ‌రిగిన ఆగ‌స్టు సంక్షోభం త‌ట్టుకున్నాం.. హుధుద్ తుపాను నుంచి విశాఖకు పూర్వ వైభ‌వం తీసుకొచ్చాం. కానీ నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప‌రిణామాల‌ను చ‌క్క‌దిద్ద‌లేక‌పోతున్నాం. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కూడా క‌నిపించ‌డం లేదంటూ‘‘ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నమే కాదు.. కలకలం సృష్టిస్తున్నాయి.

Recommended For You

3,952 Comments