ఓట‌ర్ల‌ను చంద్ర‌బాబు బెదిరిస్తున్నారా…!

క‌ర్నూలు జిల్లాలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లపై రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో, అటు ప్ర‌భుత్వంలో వ‌ర‌స‌ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న చంద్ర‌బాబు అస‌హ‌నంతో మాట్లాడుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌తిప‌క్షాలు ఓట్లు కొనేందుకు ప్ర‌య‌త్నిస్తాయి.. అయినా మీరు ప్ర‌భుత్వ అభివృద్ధి చూసి ఓటువేయాల‌ని ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేయ‌వ‌చ్చు. కానీ అలా కాకుండా నేను త‌లుచుకుంటే ఓటుకు 5వేలు అయినా ఇవ్వ‌గ‌ల‌ను కానీ నేను ఇవ్వ‌ను అన‌డం చంద్ర‌బాబు స్థాయికి త‌గ‌దు. అంటే డ‌బ్బులు త‌న ద‌గ్గ‌ర కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారా? దేశంలో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు నేనే అంటూ ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు… రోడ్లు ఇచ్చాను కాబ‌ట్టి నాకే ఓటు వేయాలి. లేదంటే మీకు ప‌నిచేయ‌ను అన్న‌ట్టుగా సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌ద‌లుచుకున్నారు.  నంద్యాలలో నాయకులు వరసగా పార్టీ వీడడం.. అటు చంద్రబాబు వచ్చినా జనాలు పెద్దగా స్పందించకపోవడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. పైగా ప్రజలు సమస్యలతో ఆయన్ను చుట్టుముట్టడం ఎన్నికల ముందు తనకు ఎక్కడ మైనస్ గా మారుతుందో అని సీఎం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఏ జిల్లా వెళ్లినా చంద్ర‌బాబు తీరు అలాగే ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

Recommended For You

Comments are closed.