తెలంగాణ బీజేపీలో “కార్”చిచ్చు..?

తెలంగాణ బీజేపీలో కారు క‌ల్లోలం రేగుతోంది. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర పడుతున్నాయి. రెండేళ్లు మాత్ర‌మే గ‌డువుంది. కానీ రాజ‌కీయంగా ఎలాంటి వ్యూహం అనుస‌రించాలన్న అంశంపై స్ప‌ష్ట‌త లోపించింది. దీంతో క్యాడ‌ర్‌లో అయోమ‌యం.. నాయ‌క‌త్వంలో గంద‌ర‌గోళంగా మారింది. అదిష్టానం సొంతంగా అధికారంలోకి రావ‌డానికి కృషి చేయాల‌ని ఆదేశిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సొంతంగా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్న సీట్లు కూడా కాపాడుకోవ‌డం క‌ష్ట‌మే అని కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. టీడీపీతో పొత్తు కొన‌సాగినా ప్ర‌యోజ‌నం లేద‌న్న భావ‌న […]

Continue Reading

ఆ విష‌యంలో కేసీఆర్ త‌ప్పు చేస్తున్నారా..?

రాజ‌కీయంగా, ప్ర‌భుత్వం ప‌రంగా ప‌ట్టు సాధించిన కేసీఆర్ ఒక‌రి విష‌యంలో మాత్రం త‌ప్పు చేస్తున్నారా. ఆయన ఎవ‌రో కాదు.. ఒక‌ప్పుడు తెలంగాణ జేఏసీకి నేతృత్వం వ‌హించిన కోదండ‌రామ్‌. ప్ర‌తి విష‌యంలో ఉన్న‌తంగా ఆలోచించే ముఖ్య‌మంత్రి.. పార్టీ  తెలంగాణ రాష్ట్ర స‌మితి ఈ జేఏసీ నాయ‌కుడి విష‌యంలో ఎందుకు అంచ‌నా వేయ‌లేక‌పోతోంది. ఇటీవ‌ల కాలంలో కోదండ‌రామ్ పార్టీకి, ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌గానే మారారు సందేహం లేదు. ఆయన విమర్శలకు తెర‌వెన‌క ప్రత్యర్ధి పార్టీల వ్యూహం ఉండొచ్చు.. ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ వివాదం […]

Continue Reading

జానారెడ్డి సీక్రెట్ స్టోరీ ఇదేనా..!

తెలంగాణ వ‌చ్చినా క్రెడిట్ త‌మ‌కు ద‌క్క‌లేద‌ని కాంగ్రెస్ నేత‌లు తెగ క‌లత చెందుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో అధికారం కేసీఆర్ ప‌రం అయింది. క‌నీసం 2019లో అయినా అధికారం వ‌స్తుంద‌ని హ‌స్తం నేత‌లు భావించారు. కానీ పార్టీలో అంత‌ర్గ‌త పోరు.. గ్రూపు రాజ‌కీయాలు చేటు చేస్తున్నాయి. ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షంగా కూడా విఫ‌లం అవుతున్నార‌న్న సంకేతాలు జ‌నాల్లోకి వెళ్లాయి. విప‌క్షంగానే వీరి మ‌ధ్య స‌ఖ్య‌త లేదు.. ఇక గెలిస్తే వీళ్లేం చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో లాభం లేదనుకున్న కాంగ్రెస్ […]

Continue Reading

రేవంత్ రెడ్డి ఇంట్లో భోజ‌నానికి కేసీఆర్‌…!

తెలుగుదేశం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ముందుంటారు. ఒక్కోసారి హ‌ద్దులు మీరి వ్య‌క్తిగ‌త కామెంట్లు చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. రాజ‌కీయంగా ఇద్ద‌రికి బ‌ద్ద‌వైరం ఉంది. ఓటుకు నోటు కేసు త‌ర్వాత ఇది మ‌రింత పెరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ద‌శాబ్ధాల క్రితం సిఎంలు ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇంటికి వెళ్లి భోజ‌నాలు చేసి.. రాష్ట్ర ప్ర‌గ‌తిపైనా, తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పైనా మంచి […]

Continue Reading

వ‌రాలు ఇచ్చారు.. ఇక భ‌యాలు కూడా పెంచాలి..!

తెలంగాణ‌లో ఉద్యోగులకు సిఎం వ‌రాలు కురిపించారు. 10 రోజుల్లోనే కారుణ్య నియామ‌కాలు,  రిటైర్మెంట్ రోజునే గ్రాట్యుటీ, పిఎఫ్ డ‌బ్బు, పెన్ష‌న్లు, భార్య‌భ‌ర్త‌లకు ఒకేచోట ఉద్యోగాలు ఇలా వ‌రాల వ‌ర్షంతో త‌డిపి ముద్దచేశారు. ఉద్యోగిగా దాదాపు మూడు నుంచి నాలుగు ద‌శాబ్ధాల సేవ‌లు అందించే వారి ప‌ట్ల ప్ర‌భుత్వం ఆమాత్రం బాధ్య‌త తీసుకోవ‌డంలో త‌ప్పులేదు. వారి సంక్షేమం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. కానీ అదే స‌మ‌యంలో వారికి భ‌యం కూడా పెరిగేలా సిఎం సందేశం ఇవ్వాలి. ఉద్యోగుల […]

Continue Reading

భ‌లేమంచి చ‌ర్చ‌లు…!

తెలంగాణ అసెంబ్లీలో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంత ప్ర‌శాంతంగా అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. వాస్త‌వానికి చాలాకాలంగా స‌మావేశాలు ఆశించిన ఫ‌లితాలను ఇవ్వడం లేదు. చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే ర‌చ్చ‌తో ముగుస్తున్నాయి. ఇంత‌కాలం తెలంగాణ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. కానీ ఈ స‌మావేశాల్లో ముందుగానే అధికార పార్టీ చొర‌వ ప్ర‌ద‌ర్శించిన అసెంబ్లీలో చ‌ర్చ‌ల‌కు ఆస్కారం క‌ల్పించింది. ప్ర‌తిప‌క్షాల‌కు సందేశం పంపింది. ఎన్ని రోజులు అయినా ఏ అంశం అయినా చ‌ర్చించ‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్ట‌త […]

Continue Reading

హోంవ‌ర్కు అని అశ్లీల చిత్రాలు చూస్తున్నార‌ట‌.!

హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీ పోలీసులు సుమారు 65 మంది చిన్నారుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య మైన‌ర్లు ఉన్నారు. వీరందరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వీరికే కాదు.. త‌ల్లిదండ్రుల‌కు కూడా క్లాసులు పీకారు. వీరు చేసిన నేరం చూసి మెుక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు. మైన‌ర్లు అంతా స్ట‌డీ మెటిరియ‌ల్‌, హోంవ‌ర్కు, ప్రాజెక్టు వ‌ర్కు అంటూ ఇంట‌ర్‌నెట్ కేఫ్‌ల‌కు డ‌బ్బులు తీసుకెళ్లి.. పోర్న్ సైట్‌ల‌ను చూస్తున్నార‌ట‌. ఇటీవ‌ల ఇద్ద‌రు ముగ్గురు త‌ల్లిదండ్రులు […]

Continue Reading

కేసీఆర్ మ‌న‌వ‌డిపై మీడియా అతిగా స్పందిస్తుందా?

ఇటీవ‌ల కొన్ని ప‌త్రిక‌లు, సోష‌ల్ మీడియాలో చిన్న పిల్లాడు హిమాంశ్ పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయాడు. ఈ పిల్లాడు ఎవ‌రో కాదు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌వ‌డు. మంత్రి కేటీఆర్ వార‌సుడు. ఇత‌ర నాయ‌కులు పిల్ల‌ల‌తో పోల్చితే హిమాంశ్ కాస్త యాక్టీవ్‌గానే ఉంటాడు. కేసీఆర్‌కు కూడా మ‌న‌వ‌డు అంటే తెగ ఇష్టం. ఇంత‌కాలం ఉద్య‌మంలో బిజీగా ఉండి కుటుంబంతో గ‌డ‌ప‌లేక‌పోయిన కేసీఆర్ ఇప్పుడు కూడా సిఎంగా క్ష‌ణం తీరిక లేక‌పోయినా.. ఏదో ర‌కంగా మ‌న‌వ‌డితో గ‌డ‌ప‌టానికి వీలుచూసుకుని వెంట తీసుకొస్తుంటారు. […]

Continue Reading

సంప‌న్నుల కాల‌నీ దాకా యంత్రాలు రావాలి…!

ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఖ‌చ్చితంగా అభినందించాల్సిందే. గ‌త పాల‌కులు పాపాల‌ను క‌డ‌గాల‌నుకోవ‌డం కూడా ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. ప్ర‌స్తుతం భండారి లే అవుట్‌లో వెలిసిన అక్ర‌మ అంత‌స్తుల‌ను నేల‌మ‌ట్టం చేయ‌డం భాగ్య‌న‌గ‌ర వాసులు స్వాగ‌తిస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ రెండున్న‌రేళ్లలో తీసుకున్న మంచి నిర్ణ‌యాల్లో ఒక‌టిగా ఉంటుంది. కానీ ఇది అసెంబ్లీ స‌మావేశాల ముందు హ‌డావిడిగా మార‌కూడ‌దు. న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లో వెలిసిన‌ అక్ర‌మ భ‌వ‌నాలు అంతు తేల్చేవ‌ర‌కు సాగాలి. కేవ‌లం నిజాంపేట మాత్ర‌మే కాదు.. కూల్చివేత యంత్రాలు […]

Continue Reading

వాహ‌నాల‌కు రిజిస్ట్రేష‌న్ కోడ్‌లు ఖ‌రారు

తెలంగాణ జిల్లాల‌కు ర‌వాణాశాఖ కోడ్‌లు కేటాయించింది. ఈ నెంబ‌ర్ల‌తోనే కొత్త వాహ‌నాల‌కు రిజిష్ట్రేష‌న్ చేస్తారు.. అధికారికంగా విడ‌ద‌ల చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి. జిల్లాలు – కోడ్‌లు ఆదిలాబాద్ – TS 1, కరీంనగర్ – TS 2, వరంగల్ అర్బన్ – TS 3, ఖమ్మం – TS 4, నల్గొండ – TS 5, మహబూబ్‌నగర్ – TS 6, రంగారెడ్డి – TS 7, మేడ్చల్ – TS […]

Continue Reading