చింతమడకలో ఓటు వేయని కేసీఆర్…!

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆయన కేరళ పర్యటనలో ఉండడంతో ఓటు వేయలేకపోయారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో బాగంగా ఆయన కేరళ వెళ్లినట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. కేరళ సీఎం పినరయ్ విజయన్ తో ఆయన చర్చలు జరిపారు. ఇందులో బాగంగానే ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న కేసీఆర్ తన స్వగ్రామంలో  ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.

Continue Reading

న‌టి స‌రేఖావాణి భ‌ర్త సురేష్ తేజ‌ మృతి

అక్క‌గా.. వ‌దిన‌గా, అత్త‌గా, కోడ‌లిగా త‌న‌దైన శైలిలో వెండితెరపై ఆకట్టుకుంటున్న సురేఖావాణికి క‌ష్ట‌మొచ్చింది. ఆమె భ‌ర్త సురేష్ తేజ అనారోగ్యంతో మృతిచెందాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. 2 నెలల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సురేష్‌.. సోమ‌వారం గుండెపోటుతో మృతిచెందాడు. సురేశ్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. ఓ ప్రైవేటు చాన‌ల్ లో సురేఖ యాంక‌ర్ గా ఉన్న స‌మ‌యంలో స‌రేష్ తో ప‌రిచ‌యం అయింది. అప్ప‌టికే టీవీషోల‌కు సురేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించేవారు. […]

Continue Reading

లవర్ కూడా ఉంది.. కానీ సైకో లవర్ అరాచకాలు తెలియదట..!

హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డి లీలలు ఒక్కక్కటిగా బయటపడుతోంది. అమాయక బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన ఈ నిందుతుడికి  ప్రేమకథ కూడా ఉందట.  వేములవాడలో ఉండే యువతితో పరిచయం ప్రేమంగా మారిందట. వీరిద్దరూ తరచుగా కలుసుకోవడంతో పాటు.. ట్రిప్ లు కూడా వేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు  తన నేర చరిత్ర గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డాడట. తన సామాజిక వర్గమే కావడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్దపడినట్టు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ ఇంతలో మనోడి చరిత్ర […]

Continue Reading

ఏపీ ఎగ్జిట్ పోల్స్ 19నే.. తెలంగాణ లెక్క కూడా అప్పుడే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తాను చేయించిన సర్వే.. ఎగ్జిట్ పోల్స్ వివరాలు కూడా ఈ నెల 19న మీడియా సమక్షంలో వెల్లడిస్తానని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు.  సర్వే నివేదిక వచ్చిందని..అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో బయటపెట్టడం సాధ్యం కాదని అంటున్నారు. చివరి దశ ఎన్నికల ముగిసిన రోజే సాయంత్రం బహిర్గతం చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన త్వరలోనే ఇండియాకు రానున్నారు. లగడపాటి రాజగోపాల్ అమెరికా పోవడానికి కారణం కూడా సర్వేనంటున్నారు. ఇక్కడ ఉంటే నాయకులు ఫోన్లు […]

Continue Reading

ఎండదెబ్బకు మంచుకొండల్లో పడ్డ నేతలు

ఎన్నికలు మాంచి ఎండకాలం వచ్చాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో నాయకులు ఎండల్లో మాడి మసైపోయారు. అటు పొలిటికల్ హీట్.. ఇటు సన్ స్ట్రోక్ తో నాయకులు తల్లడిల్లిపోయారు. ఎన్నికలు ముగియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న నేతలు ఫలితాలకు ఇంకా నెలరోజులు ఉంది కాదా.. అని సేద తీరుతున్నారు. ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం ఎన్నికల ఖర్చులు పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాలతో విహారయాత్రలకు చెక్కేశారు. చాలామంది నాయకులు ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఫలితాలు […]

Continue Reading

కేసీఆర్ దగ్గరే సమాచారశాఖ.. మరి సీఎంకు తెలిసే చర్యలు?

జర్నలిస్ట్ ల పై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వార్తలో నిజం లేదని ఏకంగా అక్రిడేషన్ రద్దు చేసిన మేడ్చల్ కలెక్టర్. ఈనాడు మేడ్చల్ జిల్లా రిపోర్టర్ బానుచందర్ రెడ్డి.. ఇటీవల ఓ కథనం రాశారు. ప్రస్తుతం తార్నాకలో ఉన్న HMDA కార్యాలయం త్వరలోనే అమీర్ పేటకు మారుస్తారంటూ కథనం సారాంశం. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తప్పుడు కథనాలు రాశారని ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు.. తప్పుడు వార్త రాసిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ […]

Continue Reading

విహారయాత్రలోనూ స్పెషల్ చూపించిన రేవంత్ రెడ్డి..?

మండె ఎండల్లో అలుపెరగకుండా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీచేసిన రేవంత్… మిగతా కాంగ్రెస్ నాయకుల కంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు. పెద్ద నియోజకవర్గం కావడంతో క్షణం తీరిక లేకుండా పర్యటనలు చేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రమంతా పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికలు మెగిసిన వెంటనే ఆయన విశ్రాంతి కోసం టూరు ప్లానేశారు. కానీ అనూహ్యంగా ఇంటర్ విద్యార్ధులు ఇష్యూ తెరమీదకు రావడంతో ఉద్యమబాట పట్టారు. టూరు వాయిదా […]

Continue Reading

రెవెన్యూ శాఖకు.. కేటీఆర్ సిఎం పదవికీ లంకె పడిందా..?

తెలంగాణ కేబినెట్ లో ఉండాల్సిన ఇద్దరు కీలక వ్యక్తులు ఈ సారి ప్రమాణస్వీకారం చేయలేదు. హరీష్ రావు సంగతి వేరే.. దీనిపై జరుగుతున్న చర్చలు.. రాజకీయంగా ఉండే అనివార్య పరిస్థితులు విభిన్నం. కానీ అత్యంత సమర్దుడు, పార్టీకి కీలక నేత అయిన కేటీఆర్ లేకపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. అయితే ఆయన నేరుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం అవుతారని  దాదాపు ఫిక్స్ అయ్యారు. సంకేతాలు కూడా వచ్చాయి. వాస్తవానికి జూన్ మాసంలో కేటీఆర్ కీలక పదవి తీసుకుంటారని చర్చ […]

Continue Reading

యాదాద్రిమీద ప్రేమేనా.. విద్యార్ధులపై లేదా కేసీఆర్?- రేవంత్ రెడ్డి

గుడి కంటే బడి గొప్పదంటారు.. కానీ కేసీఆర్ విద్యార్ధులకు భవిష్యత్తు నిచ్చే బడి కంటే గుడినే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రిపై చూపిన ప్రేమలో 10శాతం విద్యార్ధులపై చూపినా ఇంటర్ స్టూడెంట్స్ కు ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు రేవంత్ రెడ్డి. ఇన్ని ఆత్మహత్యలకు కారణమైనవాళ్లను దేవుడు కూడా క్షమించడన్నారు. ఏమాత్రం బాధ్యత ఉన్నా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలన్నారు. రాజకీయ వలసలు.. దేవుళ్ల […]

Continue Reading

హరీష్‌ను తిడితే జగ్గారెడ్డికి టిఆర్ఎస్‌లోకి ఎంట్రీ వస్తుందా?

జగ్గారెడ్డి రూటు మార్చారా? టిఆర్ఎస్‌ లో చేరేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదనిపిస్తోంది. ప్రగతిభవన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం కోసం నానాపాట్లు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల మీడియాతో చిట్‌ చాట్‌ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను కేసీఆర్‌ , కేటీఆర్‌ లకు వ్యతిరేకం కాదని.. వారి పనితీరు అధ్బుతంగా ఉందని.. హరీష్‌ రావు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులనే తాను విమర్శిస్తున్నాననడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ప్రస్తుతం […]

Continue Reading