ముగ్గురి ల‌క్ష్యం ఒక్క‌టేనా..!

గ‌త కొంత‌కాలంగా నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ త‌న‌య క‌విత వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. గ‌తంలో ఢిల్లీలో, నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎక్కువ‌గా క‌నిపించేవారు. ఇత‌ర జిల్లాల్లో జాగృతి కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే హాజ‌ర‌య్యేవారు. కానీ ఇటీవ‌ల అన్ని జిల్లాలు చుట్టేస్తున్నారు. అంతే కాదు ప్ర‌సంగాల‌తో అద‌ర‌గొడుతున్నారు. ఇప్ప‌ట్లో ఢిల్లీ రాజ‌కీయాల్లో మంత్రిగా ఫ్యూచ‌ర్ లేద‌ని భావించిన క‌విత‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కీల‌క పాత్ర పోషించాలనుకుంటున్నారు. అందుకే రాజ‌కీయంగా త‌న‌దైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. విదేశాల నుంచి రాగానే రాష్ట్ర […]

Continue Reading

నామినేటెడ్ ప‌ద‌వుల‌పై హ‌రీష్ అల‌క‌?

హ‌రీష్‌రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తేస్తారు. ఆయ‌న పనితీరును కొనియాడ‌తారు. సిద్దిపేట జిల్లా ప్రారంభోత్స‌వంలో ఒక‌రినొక‌రి అనుబంధం చూసి రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ళ్లు చెమ‌ర్చాయి. కార్య‌క‌ర్త‌లు కూడా తెగ సంతోష‌ప‌డ్డారు. దీంతో కొంత‌కాలం క్రితం వ‌చ్చిన రూమ‌ర్స్‌కు బ్రేకులు ప‌డ్డాయి. కేటీఆర్ వ‌చ్చిన త‌ర్వాత హ‌రీష్‌రావును ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఊహాగానాలు వినిపించాయి. పైగా హ‌రీష్‌రావుకు మైనింగ్ శాఖ తీసేసిన త‌ర్వాత మ‌రీ ఇబ్బందిప‌డ్డార‌ని వార్త‌లు రాశారు. అదంతా నిజం కాద‌ని తేలిపోయింది. అంతా స‌ర్దుకుంది అనుకుంటున్న స‌మ‌యంలో కొత్త […]

Continue Reading

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల వెనక రహస్యం..!

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు అగ్ర‌స్థానంలో నిలిచాయి. తెలుగువారు సాధించిన విజ‌యంగా అంతా వేనోళ్ల పొగుడుతున్నారు. ఘ‌న‌త‌గా చాటుకుంటున్నారు. మ‌రి అంత‌గా ఇందులో ఉన్న గొప్ప‌త‌నమేంటి? ఈ ర్యాంకుల వ‌ల్ల ఆయా రాష్ట్రాల‌కు ఒరిగేదేమిటి.. పేద‌ల జీవితాల్లో వ‌చ్చే మార్పులేంటి ఇవ‌న్నీ లెక్క‌లేసే ర్యాంకులు ఇచ్చారా? వాస్త‌వానికి ఈ రేటింగ్ ఇవ్వ‌డం ద్వారా తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అధ్బుత ఫ‌లితాలు సాధించాయ‌ని కేంద్రం చెప్ప‌డం లేదు. ఇక్క‌డ త‌లుపులు బార్లా తెరిచారు. మార్కెట్‌లు గుత్తాగా […]

Continue Reading

రిజర్వేష‌న్లు.. విభిన్న‌స్వరాలు

కేసీఆర్ మ‌రోసారి తేనెతుట్టును క‌దిపారా.. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీస్తుంది. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంలో ముందుండే కేసీఆర్, రిజ‌ర్వేష‌న్లు వ్య‌వ‌హారంలో కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌నుకుంటున్నారా? కానీ అది కొన్ని వ‌ర్గాల‌కు సంతృప్తినిచ్చినా.. మిగిలిన వ‌ర్గాలను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఇప్ప‌టికే రాజ్యాంగం క‌ల్పించిన కోటాలు దాటుతున్నాయి. మైనార్టీల‌కు హామీ ఇచ్చారు. గిరిజ‌నుల‌కు పెంచుతామ‌న్నారు. ఇప్పుడు బీసీల‌కు కూడా దామాషా ప‌ద్ద‌తిలో క‌ట్ట‌బ‌డి ఉన్నామంటున్నారు. అట్ట‌డుగు వ‌ర్గాల‌కు న్యాయం చేయాల‌నుకోవ‌డంలో త‌ప్పు లేదు. వారిని ఉద్ద‌రించ‌డ‌మే ప్ర‌భుత్వం ల‌క్ష్యం. […]

Continue Reading

సాంబ‌శివ.. వ్యూహాల‌కు కేరాఫ్‌

సాంబ‌శివ‌రావు.. ఈ పేరు ఏపీలో మార్మోగుతోంది. వాస్త‌వానికి ఆయ‌న ఎంత సైలెంట్‌గా కనిపిస్తారో… అంత వైలెంట్ ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళ‌తారు. మాట‌ల్లో దూకుడు చూపించే మ‌నిషి కాదు.. చేత‌ల్లో చూపిస్తాడు. మాట‌ల‌తో మ‌ట్టిక‌రిపిస్తాడు. అదే ఆయ‌న స్టైల్‌. ఆయ‌నే డీజీపీ సాంబ‌శివ‌రావు. సాంబ‌శివ‌రావుకు ఓ స్టైల్ ఉంది. ఆయ‌న ప‌లానా పోస్టు కావాలి.. అదే చేస్తాను అనే ర‌కం కాదు. ఇచ్చిన బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్దవంతంగా నిర్వ‌హించ‌డ‌మే తెలుసు. ఒక‌ప్పుడు విశాఖప‌ట్నం క‌మీష‌న‌ర్‌గా చేసినా.. ఆ త‌ర్వాత రాష్ట్రస్థాయి […]

Continue Reading

స్విస్ ఛాలెంజ్‌పై పున‌రాలోచ‌న అందుకేనా..!

స్విస్‌ఛాలెంజ్ విధానంలో అత్య‌త్తుమ రాజ‌ధాని క‌డ‌తామ‌ని చంద్ర‌బాబునాయుడు ప‌దేప‌దే ప్ర‌క‌టించారు. గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచారు. సింగ‌పూర్ కంపెనీలు ముందుకు వ‌చ్చాయి. అయితే ముందుగా వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌లు న‌చ్చ‌లేదు. దీంతో మ‌ళ్లీ పిలిచారు. మ‌రికొన్ని కంపెనీలు బిడ్లు దాఖ‌లు చేశాయి. అయితే ఇప్పుడు అక‌స్మాత్తుగా స్విస్‌ఛాలెంజ్ విధానంపై వెన‌క్కు త‌గ్గారు. మ‌ళ్లీ కొత్త‌గా నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని చెప్పారు. న్యాయ‌ప‌రంగా చిక్కులు త‌ప్పించుకోవ‌డానికి వేసిన వ్యూహ‌మా.. లేక నిజంగానే స్విస్‌ఛాలెంజ్ విధానానికి గుడ్‌బై ప‌థ‌క‌మా అన్న చ‌ర్చ మొద‌లైంది. గ్లోబ‌ల్ […]

Continue Reading

రెండున్న‌రేళ్ల సంబ‌రాలు వెన‌క ర‌హ‌స్య‌మిదేనా..!

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్ల సంద‌ర్భంగా వేడుకులు నిర్వ‌హించాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో నిజ‌మెంతో కానీ.. కేడ‌ర్‌లో మాత్రం చ‌ర్చనీయాంశంగా మారింది. జ‌నాల్లో కూడా ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు సంబ‌రాలు నిర్వ‌హిస్తారు. కానీ ఇలా మ‌ధ్య‌లో ఎలా చేస్తారంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో స‌గం విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ప్పుడు సంబ‌రాలు చేసుకోవ‌డంలో త‌ప్పేముంద‌ని కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. పైగా స్వాగ‌తిస్తున్నారు. ఘ‌నంగా చేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే కార్య‌క‌ర్త‌లు ఆలోచ‌న‌లు ఎలా ఉన్నా.. […]

Continue Reading

చివ‌రి అవ‌కాశమిదేనా…!

తెలుగుదేశం తెలంగాణ‌ చివ‌రి ప్ర‌య‌త్నం చేస్తుందా..? పార్టీ డెడ్‌లైన్ విధించుకుందా? అవునంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. ఒక‌ప్పుడు తెలంగాణ‌లో తిరుగులేని శ‌క్తిగా ఉన్న టీడీపీ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం దాదాపు క‌నుమ‌రుగు అవుతోంది. ఎమ్మెల్యేలు జెండా మార్చారు. ఉన్న‌వాళ్ల‌లో ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. పునాదులపై ఇంకా న‌మ్మ‌కం ఉన్న టీడీపీ చివ‌ర‌గా ఓ ప్ర‌య‌త్నం చేస్తోంది. అదే 2019 ఎన్నిక‌లు. రేవంత్ రెడ్డిపై భారం వేసి కార్య‌క‌ర్త‌ల‌ను, పార్టీని న‌డిపించే బాధ్య‌త‌ను అప్ప‌గించారు. కావాల్సిన వ‌న‌రులు స‌మ‌కూర్చి పార్టీని గెలిపించాల‌ని […]

Continue Reading

ఏది వ‌రం.. మ‌రేది భారం…!

పోల‌వ‌రం ప్రాజెక్టు.. ఇదో మాయాజాలంగా మారింది. 2018 నాటికి పూర్తి చేస్తానంటారు.. మ‌ళ్లీ పురుషోత్త‌ప‌ట్నం ఎత్తిపోత‌ల ప‌థ‌కం తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. చంద్ర‌బాబు నిర్ణ‌యాలు కాస్త కన్‌ఫ్యూజ‌న్‌గానే ఉన్నాయి. వాస్త‌వానికి పోల‌వ‌రం అనుకున్న గ‌డువు 2018 నాటికి పూర్తి చేస్తే పురుషోత్త‌ప‌ట్నం అవ‌స‌రం లేదు. మ‌రీ అంత‌గా అవ‌స‌రం అనుకుంటే పుష్క‌రం అందుబాటులోనే ఉంది. మ‌రి కొత్త ప్రాజెక్టు ఎందుకు తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్టు. పోల‌వ‌రంపై అనుమానాలే తాజా నిర్ణ‌యానికి కార‌ణమా? పోల‌వ‌రం.. .జాతీయ ప్రాజెక్టుగా ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి […]

Continue Reading

భాగ్యనగరానికి ఓటు యాత్రలు ..!

హైద‌రాబాద్ కేంద్రంగా రాజ‌కీయాలు జోరందుకున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో భాగ్య‌న‌గ‌రానికి ప్రాధాన్య‌త అంతంత మాత్ర‌మే. కానీ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం హైద‌రాబాద్‌, దీని చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాలు పార్టీలు కీల‌కంగా భావిస్తున్నాయి. తెలంగాణ‌లో ఇప్పుడు మెజార్టీ సీట్లు హైద‌రాబాద్‌, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్క‌డ ప‌ట్టు సాధిస్తే అధికార పీఠానికి ద‌గ్గ‌ర కావొచ్చు. అందుకే జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇంత‌కీ హైద‌రాబాద్‌పై గురిపెట్టింది ఎవ‌రు? ఏయే వ‌ర్గాల‌కు మ‌రే పార్టీలు గాలం వేస్తున్నాయి. ప‌రివారం ఎత్తులు ఇప్ప‌టికే […]

Continue Reading