ఎండదెబ్బకు మంచుకొండల్లో పడ్డ నేతలు

ఎన్నికలు మాంచి ఎండకాలం వచ్చాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో నాయకులు ఎండల్లో మాడి మసైపోయారు. అటు పొలిటికల్ హీట్.. ఇటు సన్ స్ట్రోక్ తో నాయకులు తల్లడిల్లిపోయారు. ఎన్నికలు ముగియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న నేతలు ఫలితాలకు ఇంకా నెలరోజులు ఉంది కాదా.. అని సేద తీరుతున్నారు. ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం ఎన్నికల ఖర్చులు పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాలతో విహారయాత్రలకు చెక్కేశారు. చాలామంది నాయకులు ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఫలితాలు […]

Continue Reading

చెట్టులో మహత్యమట.. మిస్టరీ ఎంటో మీరూ చూడండి?

ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వేపచెట్టు మహత్యం అంటూ జనాలు తెగ సందడి చేస్తున్నారు. జిల్లాలోని చిట్టమూరు మండలం కుమ్మరిపాలెంలో వేపచెట్టుకు ఉన్న ఒకటి నాగుపాము పడగ పోలి కనిపించింది. దీని ఆకృతి పాములాగే ఉండడంతో ఇంకేముంది జనాలకు భక్తి పారవశ్యం పెరిగింది. దీనిని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు తరలిస్తున్నారు. అంతేకాదు..  స్థానికులు పూజలు సైతం చేస్తున్నారు. దేవుని మహత్యం ఉందని.. జనాలు నమ్ముతున్నారు. కానీ అలాంటివి సహజం అని హేతువాదులంటున్నారు. మొత్తానికి జిల్లాలో ఇదో పెద్ద టాపిక్ అయింది.. […]

Continue Reading

కేసీఆర్ దగ్గరే సమాచారశాఖ.. మరి సీఎంకు తెలిసే చర్యలు?

జర్నలిస్ట్ ల పై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వార్తలో నిజం లేదని ఏకంగా అక్రిడేషన్ రద్దు చేసిన మేడ్చల్ కలెక్టర్. ఈనాడు మేడ్చల్ జిల్లా రిపోర్టర్ బానుచందర్ రెడ్డి.. ఇటీవల ఓ కథనం రాశారు. ప్రస్తుతం తార్నాకలో ఉన్న HMDA కార్యాలయం త్వరలోనే అమీర్ పేటకు మారుస్తారంటూ కథనం సారాంశం. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తప్పుడు కథనాలు రాశారని ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు.. తప్పుడు వార్త రాసిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ […]

Continue Reading

విహారయాత్రలోనూ స్పెషల్ చూపించిన రేవంత్ రెడ్డి..?

మండె ఎండల్లో అలుపెరగకుండా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీచేసిన రేవంత్… మిగతా కాంగ్రెస్ నాయకుల కంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు. పెద్ద నియోజకవర్గం కావడంతో క్షణం తీరిక లేకుండా పర్యటనలు చేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రమంతా పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికలు మెగిసిన వెంటనే ఆయన విశ్రాంతి కోసం టూరు ప్లానేశారు. కానీ అనూహ్యంగా ఇంటర్ విద్యార్ధులు ఇష్యూ తెరమీదకు రావడంతో ఉద్యమబాట పట్టారు. టూరు వాయిదా […]

Continue Reading

రెవెన్యూ శాఖకు.. కేటీఆర్ సిఎం పదవికీ లంకె పడిందా..?

తెలంగాణ కేబినెట్ లో ఉండాల్సిన ఇద్దరు కీలక వ్యక్తులు ఈ సారి ప్రమాణస్వీకారం చేయలేదు. హరీష్ రావు సంగతి వేరే.. దీనిపై జరుగుతున్న చర్చలు.. రాజకీయంగా ఉండే అనివార్య పరిస్థితులు విభిన్నం. కానీ అత్యంత సమర్దుడు, పార్టీకి కీలక నేత అయిన కేటీఆర్ లేకపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. అయితే ఆయన నేరుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం అవుతారని  దాదాపు ఫిక్స్ అయ్యారు. సంకేతాలు కూడా వచ్చాయి. వాస్తవానికి జూన్ మాసంలో కేటీఆర్ కీలక పదవి తీసుకుంటారని చర్చ […]

Continue Reading

యాదాద్రిమీద ప్రేమేనా.. విద్యార్ధులపై లేదా కేసీఆర్?- రేవంత్ రెడ్డి

గుడి కంటే బడి గొప్పదంటారు.. కానీ కేసీఆర్ విద్యార్ధులకు భవిష్యత్తు నిచ్చే బడి కంటే గుడినే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రిపై చూపిన ప్రేమలో 10శాతం విద్యార్ధులపై చూపినా ఇంటర్ స్టూడెంట్స్ కు ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు రేవంత్ రెడ్డి. ఇన్ని ఆత్మహత్యలకు కారణమైనవాళ్లను దేవుడు కూడా క్షమించడన్నారు. ఏమాత్రం బాధ్యత ఉన్నా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలన్నారు. రాజకీయ వలసలు.. దేవుళ్ల […]

Continue Reading

హరీష్‌ను తిడితే జగ్గారెడ్డికి టిఆర్ఎస్‌లోకి ఎంట్రీ వస్తుందా?

జగ్గారెడ్డి రూటు మార్చారా? టిఆర్ఎస్‌ లో చేరేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదనిపిస్తోంది. ప్రగతిభవన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం కోసం నానాపాట్లు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల మీడియాతో చిట్‌ చాట్‌ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను కేసీఆర్‌ , కేటీఆర్‌ లకు వ్యతిరేకం కాదని.. వారి పనితీరు అధ్బుతంగా ఉందని.. హరీష్‌ రావు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులనే తాను విమర్శిస్తున్నాననడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ప్రస్తుతం […]

Continue Reading

కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు రేవంత్‌ రెడ్డికి ఇస్తున్నారా?

ఫిరాయింపులు, కేడర్‌ వలసలతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో నానాటికి చిక్కిపోతోంది. ఎప్పుడూ లేనంతస్థాయిలో బలహీనపడుతోంది. వచ్చే ఎన్నికల్లో అసలు పోటీలో ఉంటుందా అన్నంతగా పతనమవుతోంది. అయినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వంటి వాళ్లు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సీఎం కు లేఖలు రాయడం.. వలసలపై ఫిర్యాదులు మినహా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో విఫలమవుతున్నారని కేడర్‌ అంటోంది. నాయకత్వం మారితే తప్ప పరిస్థితులు మెరుగుపడవని అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కాంగ్రెస్‌ దుస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు […]

Continue Reading

కుటుంబ రాజకీయాల కోసమే పార్టీ మారుతున్నారా?

కాంగ్రెస్ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారా? వాస్తవానికి మొదట్లో కేసీఆర్‌ కొందరిని మాత్రమే పార్టీలో చేరాలని ఆహ్వానించారు. విజయవంతం అయ్యారు. కానీ ఇప్పుడు చేరేవారంతా తమకు తాముగా కేసీఆర్‌ వద్దకు రాయభారం పంపినట్టు తెలుస్తోంది. గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని సందేశం పంపారట. అయితే కేసీఆర్‌ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీకి అవసరమనుకున్న నేతలను కారులోకి ఎక్కించుకుంటున్నారు. ఇటీవల పార్టీలో చేరేందుకు మగ్గురు ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. భూపాలపల్లి […]

Continue Reading

కాంగ్రెస్‌ నాయకుల వలసలు మంచికేనా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖాళీ అవుతోంది. ఎవరికి వారు అధికారపార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా ధూషించిన జగ్గారెడ్డి వంటివాళ్లు సైతం తమ కుటుంబ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారు. జానారెడ్డి వంటివాళ్లు ఒకరిద్దరు వయసు రిత్యా సైలెంట్‌ అయ్యారు. ఇక ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌ బాబు, రేవంత్‌ రెడ్డి వంటి వాళ్లు మినహా ఎవరూ మిగిలే పరిస్థితి లేదు. అయితే ఇదంతా పార్టీకే మేలు చేస్తుందన్న భావన కొందరు వ్యక్తం […]

Continue Reading