మంత్రిప‌ద‌విపై క‌న్నేసిన ఎంపీ పొంగులేటి..!

వైసీపీ త‌ర‌పున ఖమ్మం ఎంపీగా గెలిచినా.. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరారు. జిల్లాల పునర్వభజన అనంతరం ఆయ‌న చూపు కొత్త‌గూడెం జిల్లాపై ప‌డింది. జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని రెడీ చేసుకుంటున్నారు. 2019లో కొత్త‌గూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసే... Read more »

నిన్న జ‌ల‌గం.. నేడు తుమ్మ‌ల‌.. రేపు..?

నిన్న జ‌ల‌గం వెంగ‌ళ‌రావు.. నేడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. రేపు ఎవ‌రు? అంత‌టి శ‌క్తిమంత‌మైన‌ నాయ‌కులు మ‌ళ్లీ ఒక‌రు త‌యారు అవుతారా? ఇప్పుడు ఇదే ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వ్యాపారాల‌కు దూరంగా రాజ‌కీయాలే ప్రాధాన్యంగా వీరిద్ద‌రూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్న‌త స్థాయికి... Read more »

హెమాహెమీలు క‌న్నేసిన నియోజ‌క‌వ‌ర్గం..!

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవు.. ఉప ఎన్నిక జ‌రిగి ఎంతో కాలం కాలేదు. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. అయినా ఇప్ప‌డా నియోజ‌క‌వ‌ర్గం హాట్‌టాపిక్‌గా మారింది. అంద‌రినీ ఊరిస్తుంది. జాతీయ‌స్థాయిలో గుర్తింపు పొందిన నాయ‌కులు కూడా అక్క‌డే పాగా వేయ‌డానికి ఉవ్విళ్లూరుతున్నారు. అది... Read more »

తుమ్మ‌ల అనుచ‌రుల్లో అసంతృప్తి..!

టిఆర్ఎస్‌లో కేసీఆర్ త‌ర్వాత నెంబ‌ర్ 2 స్థాయిని తుమ్మ‌ల అనుభ‌విస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముఖ్య‌భూమిక ఆయ‌న‌దే. చాలామంది మంత్రులు కూడా ప‌నులు కావాలంటే తుమ్మ‌ల‌నే ఆశ్ర‌యిస్తుంటారు. కేసీఆర్‌కు చెప్పుకోలేని వాళ్లు కూడా ఈ మంత్రి వ‌ద్ద‌కు వ‌చ్చి గోడు వెళ్ల‌బోసుకుంటారు. పార్టీలో ఆయ‌న‌కున్న ప్రాముఖ్య‌త... Read more »

జ‌ల‌గానికి కుల‌మే శాప‌మా…!

జ‌ల‌గం వెంక‌ట్రావ్‌… జిల్లాల విభ‌జ‌న జ‌ర‌గ‌కముందు 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లాలో గెలిచిన ఏకైక టిఆర్ఎస్ ఎమ్మెల్యే. గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన అనుభ‌వం కూడా ఉంది. అయినా ఆయ‌న అదృష్టం ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెన‌క్కు అన్న‌ట్టుగా మారింది. మంత్రి కావాల్సిన... Read more »

కొత్తగూడెం బాగుపడాలంటే..!

జిల్లాల పున‌ర్విభజనలో ఖమ్మం జిల్లాను రెండుగా విడదీశారు. దీంతో కొత్తగా ఏర్ప‌డిన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం పారిశ్రామిక జిల్లాగా అవ‌త‌రించింది. సింగ‌రేణి గ‌నులు, ఐటీసీ భ‌ద్రాచలం, మ‌ణుగూరు హెవీవాట‌ర్ ప్లాంట్‌, కేటీపిఎస్‌, భ‌ద్రాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మ‌రే జిల్లాకు లేని... Read more »

ఖ‌మ్మంలో అంత‌ర్గ‌త పోరే కొంప ముంచుతుందా…?

ఖ‌మ్మం రాజ‌కీయాలు ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిరుగుతున్నాయి. అధికార టిఎర్ఎస్‌లో ఇప్ప‌టికే గ్రూపు రాజ‌కీయాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు ఎమ్మెల్యే భూముల‌ వ్య‌వ‌హారంలో కోర్టు ఆదేశాలు మ‌రింత రాజేశాయి. ప్ర‌భుత్వం భూమి ఆక్ర‌మించుకున్నారంటూ పార్టీకే చెందిన నాయ‌కుడు వేసిన పిటిష‌న్ అజ‌య్‌కుమార్‌కు చిక్కులు తెస్తోంది. దీనిపై... Read more »

ఇమ‌డ‌లేక‌.. దిగ‌లేక కారులో స‌త‌మ‌తం

అంతా అయిపోయింది అనుకున్నారు. సైకిల్ ప్ర‌యాణంతో ఇక లాభం లేద‌నుకున్నారు. మూకుమ్మ‌డిగా కారెక్కేశారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. కులానికి అండ‌గా ఉంటార‌ని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై భ‌రోసాతో చాలామంది ఖ‌మ్మం జిల్లా తెలుగుదేశం నాయ‌కులు టిఆర్ఎస్ గూటికి చేరారు. ద‌శాబ్దాల బందాన్ని వ‌దులుకున్నారు. కానీ... Read more »

ఎమ్మెల్యే స్వ‌యంకృతాప‌రాధం?

ఖ‌మ్మం జిల్లాలో వైరా నియోజ‌క‌వ‌ర్గం నివురుగ‌ప్పిన నిప్పులా మారింది. ఇందులో రెండు మండ‌లాల ప్ర‌జ‌లు కంటిమీద కునుకు లేకుండా రెండు వ‌ర్గాలుగా మారి ఉద్య‌మ బాట ప‌ట్టారు. వైరా ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంలో ర‌గిలిపోతున్నారు. ఏలా చూసినా నియోజ‌క‌వ‌ర్గానికి జిల్లాల విభ‌జ‌న‌లో తీర‌ని అన్యాయ‌మే... Read more »

కొత్త‌గూడెం అభివృద్ధిని ఆప‌త‌ర‌మా?

కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది.. జిల్లా కేంద్రంతో పాటు.. ప‌ట్ట‌ణం నుంచి న‌గ‌ర హోదాకు మార‌బోతుందా..? అవ‌కాశాలున్నాయంటున్నారు స్థానికులు కొత్త‌గూడెం- పాల్వంచ ఇప్ప‌టికే జంట ప‌ట్ట‌ణాలుగా గుర్తింపు పొందాయి. రెండూ మున్సిపాలిటీలుగానే ఉన్నాయి. విద్యాప‌రంగా, పారిశ్రామికంగా పేరు ప్ర‌ఖ్యాతులున్నాయి. అలాంటి ప‌ట్టణానికి ఇప్పుడు జిల్లా... Read more »