భారత‌ర‌త్నకు అమ్మ పేరును ప్ర‌తిపాదించిన కేబినెట్‌..!

దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోర‌నుంది. ఈ మేర‌కు కేబినెట్ స‌మావేశం తీర్మానం చేసింది. త్వ‌ర‌లోనే దీనిని కేంద్ర ప్ర‌భుత్వాని పంప‌నున్నారు. సినీన‌టిగా ప్ర‌స్తానం మొద‌లుపెట్టి, త‌మిళ‌నాడు సిఎంగా ఎదిగిన గొప్ప నాయ‌కురాలు అని.. ఆమె ఈ స‌త్కారానికి అర్హులేన‌ని మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఆరు సార్లు సిఎంగా ప్ర‌మాణం చేశారు ఎంపీగా సేవ‌లు అందించారు. రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసిన జ‌య‌ల‌లిత ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన మ‌హిళా రాజ‌కీయవేత్త‌ల్లో ఒక‌రిగా నిలిచార‌ని.. అందుకే కేంద్రానికి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని ఆమె పేరు ప్ర‌తిపాదిస్తున్నామ‌ని మంత్రి వ‌ర్గం చెబుతోంది. త్వ‌ర‌లో అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాల‌ని నిర్ణ‌యించారు. అంతే కాదు.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో అమ్మ నిలువెత్తు కాంస్య విగ్ర‌హం కూడా ఏర్పాటు చేయాల‌ని మంత్రులు తీర్మానం చేశార‌ట‌. విగ్ర‌హం పెట్టించాల‌ని పార్ల‌మెంట్‌లో ఒత్తిడి తెస్తామ‌ని ఎంపీలు అంటున్నారు. సంక్షేమ ప‌థ‌కాల్లో దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన ఆమె విగ్ర‌హం పార్ల‌మెంట్‌లో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎంపీలు వాదిస్తున్నారు. మ‌రి త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు అమ్మ కోసం అవి రెండూ సాధించుకుంటారా?

Recommended For You

Comments are closed.