తెలంగాణలో ఈవీఎంలపై బీజేపీ అనుమానాలు.. మరి ఏపీలో..?

ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందా? లేక లెక్కలు తారుమారయ్యాయా? ికమలనాథుల అనుమానాలకు వెనక కారణమేంటి? అసలు కమలనాథులు వాదనలో అర్ధముందా? అదే నిజమైతే ఏపీలో టీడీపీ ఆరోపణలను సమర్ధిస్తారా? తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతంపై సికింద్రాబాద్ అభ్యర్ధి కిషన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. 4 తర్వాత బూత్ లలో అసలు జనాలు లేకపోయినా.. 5శాతం గంటలో ఎలా పెరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు కూడా చేశారు.  ఏపీలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీపై ఎదురుదాడి చేస్తున్న బీజేపీ నాయకులు.. తెలంగాణలో ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విమర్శలు.. రాద్దాంతం చేస్తున్న నాయకులు  ఏపీలో వస్తున్న విమర్శలకు సమాధానం ఏం చెబుతారు? శాతంలో మార్పుకే ఇంత హైరానా పడుతున్న నాయకులు.. ఏపీలో వందల ఈవీఎంలు మొరాయించాయి.. అర్ధరాత్రి దాకా కూడా ఓట్లు వేయించారు. కొన్నిచోట్ల మధ్యాహ్నాం కూడా పనిచేయలేదు. ఈ విషయంలో ఎందుకు నోరెత్తడం లేదు. ఇది కమలనాథుల ద్వందనీతి కాదా?

For Video:

Recommended For You