వెంక‌య్య వార‌స‌త్వానికి జాతీయ నాయ‌క‌త్వం బ్రేకులు వేసిందా?

తాను యాక్టీవ్ రాజ‌కీయాల్లో ఉన్నంత‌కాలం త‌న వార‌సులు పొలిటిక‌ల్ ఎంట్రీ ఉండ‌ద‌ని గ‌తంలోనే స్ప‌ష్టం చేశారు. అయితే ఊహించ‌ని విధంగా ఆయ‌న రాజ‌కీయాల్లోకి త‌ప్పుకుని రాజ్యాంగ ప‌ద‌విలోకి వెళ్లాల్సి వ‌స్తోంది. దీంతో ఆయ‌న వార‌స‌త్వంపై అప్ప‌డే చ‌ర్చ మొద‌లైంది. ఆయ‌న కూతురు దీప‌, కొడుకు హ‌ర్ష పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇద్ద‌రిలో ఒక‌రికి రాజ‌కీయంగా భ‌విష్య‌త్తుపై వెంక‌య్య కుటుంబం ఆశ‌లు పెట్టుకుంది. కానీ జాతీయ నాయ‌క‌త్వం అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. వార‌స‌త్వ ప్ర‌శ్నే లేద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది. వెంక‌య్య‌నాయుడితో ఖాళీ అయిన రాజ్య‌స‌భ సీటును రాంమాధ‌వ్‌తో భ‌ర్తీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో వెంక‌య్య కుటుంబం అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

వార‌సుల‌తోనే చిక్కులా?
దాదాపు 5ద‌శాబ్ధాల పాటు రాజ‌కీయాలు చేసిన వెంక‌య్య కుటుంబం ఇక యాక్టీవ్ పాలిటిక్స్ కు దూర‌మేనా అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో కుటంబాన్ని విమ‌ర్శ‌లు చుట్టుముడుతున్నాయి. వెంక‌య్య కూతురు దీప నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ బార‌తి ట్ర‌స్టుపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. విదేశీ విరాళాల కోసం అనుమ‌తి తీసుకున్న సంస్థ ఐదేళ్లుగా ఎలాంటి రిట‌ర్న్‌లు దాఖ‌లు చేయ‌కపోవ‌డంపై విప‌క్షాలు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. గ‌తంలో ప‌దివేల‌కు పైగా స్వ‌చ్చంద సంస్థ‌లు ఐటీ దాఖ‌లు చేయ‌లేద‌ని ఎఫ్‌.సి.ఆర్‌.ఎ కింద‌ నిషేధం విధించిన ప్ర‌భుత్వం స్వ‌ర్ణ భార‌తిని ఎందుకు మిన‌హాయించారని కాంగ్రెస్ నాయ‌కులు మోడీ – అమిత్ షాకు లేఖ రాశారు. పైగా త‌క్కువ ధ‌లర‌ల‌కు భూములు తీసుకుని..ఆస్తి ప‌న్నుల నుంచి కూడా మిన‌హాయింపులు పొంద‌డాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. కోట్ల రూపాయ‌ల ట‌ర్నొవ‌ర్ చేసే స్వ‌చ్చంద సంస్థ ఆమాత్రం ప‌న్నులు చెల్లించ‌లేదా అని ప్ర‌శ్నించారు. ఇక అటు వార‌సుడు హ‌ర్షకు చెందిన‌ వ్యాపారాలు, ప్ర‌భుత్వాల‌కు అమ్మిన వాహ‌నాల‌పై ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. టెండ‌ర్లు లేకుండానే ప‌లు కాంట్రాక్ట్లులు తీసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

సొంత‌పార్టీలోనే ఫిర్యాదులు
పార్టీలో వెంక‌య్య వ్య‌తిరేక వ‌ర్గం తాజా ఆరోప‌ణ‌ల‌ను అనుకూలంగా మ‌లుచుకుంటున్నాయి. జాతీయ నాయ‌క‌త్వం వ‌ద్ద పంచాయితీ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కాలం ఆయ‌న త‌న వార‌సుల వ్యాపారులు, సంస్థ‌ల కోసం ఏపీ, తెలంగాణ ప్ఱ‌భుత్వాల‌తో సన్నిహితంగా ఉన్నార‌ని.. పార్టీ ప్ర‌యోజ‌నాలు కూడా ప‌క్క‌న‌పెట్టార‌ని ఫిర్యాదులు చేశార‌ట‌. ఇంత‌కాలం రాజ‌కీయాల్లో మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా ఎవ‌రికీ స‌మాధానం చెప్పుకోవాల్సిన అవ‌స‌రం రాని వెంక‌య్య నాయుడు తొలిసారి… ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళుతూ విమ‌ర్శ‌ల‌కు ప‌త్రికాముఖంగా స‌మాధానం చెప్పుకోవాల్సి రావ‌డం… పార్టీలోనే త‌న‌పై ఫిర్యాదులు రావ‌డం ప‌ట్ల క‌ల‌త చెందిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కాలం స‌న్‌, డాట‌ర్ స్ట్రోక్ లేని నాయ‌కుడు అనుకున్నారు.. కానీ ఆయ‌న కూడా త‌ప్పించుకోలేక‌పోయారు.

Recommended For You

Comments are closed.