బిగ్ బాస్‌లో ఆ ముగ్గురూ సెల‌బ్రిటీలేనా?

స్టార్‌ మాటీవీలో వ‌చ్చే బిగ్ బాస్ షోలో 13 మంది సెల‌బ్రిటీలు.. అదే తెర‌పై ఒక్క సీనులో కనిపించినా కూడా విఐపీగా చూస్తారులే.. ముగ్గురు కామ‌న్ ఆడియ‌న్‌ ఉంటార‌ని ప్ర‌చారం చేశారు. అయితే ఛాన‌ల్ ఈ ముగ్గురు సెల‌క్ష‌న్ లో కూడా సెల‌బ్రిటీల‌కే ఛాన్స్ ఇచ్చిందా? ఈ ముగ్గురు కూడా సాధార‌ణ వ్య‌క్తులు కాదన్న‌ది కొంద‌రి వాద‌న‌. ఛాన‌ల్ చెప్పిన మాట‌కు.. చూపిస్తున్న సినిమాకు తేడా ఉంద‌ని జనాల్లో టాక్‌.. కామ‌న్ ఆడియ‌న్ పేరుతో తీసుకొచ్చిన‌ ముగ్గురు.. షోలో ఉన్న సెల‌బ్రిటీల‌కు ఏమాత్రం త‌క్కువ కాదట‌. ఇందులో ఒక‌రు.. సంజ‌నా అన్నె.. ఈమె ఇప్ప‌టికే ప‌లు ఫ్యాష‌న్ షోల‌లో పాల్గొంది.. మిస్ ఇండియా పోటీల‌కు కూడా హాజ‌ర‌య్యారు. ఆమె త‌ర‌చుగా వార్త‌ల్లో ఉంటారు. అంటే ఆమె సెల‌బ్రిటీ కాద‌ని చెప్ప‌గ‌ల‌రా? అంటున్నారు. ఇక మ‌రో కామ‌న్ మెన్ కానీ కామ‌న్ ఆడియ‌న్ గ‌ణేష్.. ఆయ‌న విజ‌య‌వాడ‌లో రేడియో జాకీగా ప‌నిచేస్తున్నారు. కాస్తో కూస్తో ఆయ‌న‌కు న‌గ‌రంలో పేరుంది. వ‌ర్ధ‌మాన జాకీగా విజ‌య‌వాడ‌లో చాలామందికి ప‌రిచ‌యం. ఇక మూడో వ్య‌క్తి నూతన్ నాయుడు. ఆయ‌న సాధార‌ణ వ్య‌క్తి కాదు.. గ‌తంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన రాజ‌కీయ నాయ‌కుడు. కిర‌ణ్‌ కుమార్ రెడ్డి పెట్టిన పార్టీ త‌ర‌పున విశాఖ నుంచి పోటీచేశారు. డిపాజిట్లు రాక‌పోయినా.. స్థానికంగా ఆయ‌నకంటూ ఓ పాలోయింగ్ ఉంది. గ‌న్ మెన్ల ను పెట్టుకుని మ‌రీ ఖరీదైన కార్ల‌లో తిరిగారు. త్వ‌ర‌లో మ‌రోసారి రాజ‌కీయంగా అదృష్టం ప‌రీక్షించుకోవ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. త‌న ఇమేజ్ పెంచుకోవ‌డానికి ఆయ‌న వేసిన ఎత్తుగ‌డ అంటున్నారు. విశాఖ జిల్లాలో ప‌వ‌న్ పార్టీ అంటే జ‌న‌సేన‌లో చ‌క్రం తిప్పాల‌నుకుంటున్నారు. అంటే కామ‌న్ మెన్ పేరుతో వ‌చ్చిన వారెవ‌రు కూడా కామ‌న్ కాదని తెలుగుమీడియాలో చెవులు కొరుక్కుంటున్నారు. మ‌రి నిజంగా ఆడిష‌న్స్ జ‌రిగాయా? నామ్ కే వాస్తే జ‌రిగాయా? లోగుట్టు పెరుమాళ్ల‌కెరుక‌.

Recommended For You