ఎన్టీఆర్‌కు 2018లోనే భార‌త‌ర‌త్న‌?

తెలుగు ప్ర‌జ‌లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క‌ల సాకారం అవుతుందా.. చేస్తామంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు. అన్న నంద‌మూరి తార‌క‌రామారావుకు భార‌త‌రత్న క‌ల‌గానే మిగిలింది. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా రాష్ట్రంలో టీడీపీ చాలాకాలం అధికారంలో ఉంది. కేంద్రంలో చ‌క్రం తిప్పింది, అయినా ఇప్ప‌టికీ అంద‌నిద్రాక్ష‌గానే మిగిలింది. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టిన మ‌హానీయుడికి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని ప్ర‌తిఒక్క‌రూ కోరుకుంటున్నారు. ప్ర‌తిమ‌హానాడులో ఇది కేవ‌లం ప్ర‌క‌ట‌న‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతోంది. సాకారం కావ‌డం లేదు. కానీ ఈసారి అన్న‌గారికి ఈ గౌర‌వం ద‌క్కుతుంద‌ని కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రి ఘంటాప‌థంగా చెబుతున్నారు. ఇప్ప‌టికే కేంద్రం వ‌ద్ద‌కు ఫైల్ వెళ్లింద‌ని అంటున్నారు. మ‌రి ఈసారి అయినా ప్ర‌క‌ట‌న నిజ‌మ‌వుతుందా?

Recommended For You

Comments are closed.