వృద్దుల కోస‌మే ప‌నిచేయ‌నున్న బ్యాంకులు…!

దేశ‌వ్యాప్తంగా శ‌నివారం బ్యాంకులు తెరుచుకుంటాయి. అయితే కేవ‌లం వృద్దులు మాత్ర‌మే న‌గ‌దు మార్చుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. 500, 1000 రూపాయ‌ల నోట్లు మార్చుకోవ‌డానికి శ‌నివారం బ్యాంకులు ప‌నిచేస్తాయి. కేవ‌లం 60 ఏళ్లు దాటిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్ర‌మే బ్యాంకులో లావాదేవీల‌కు అనుమ‌తిస్తారు. ఇటీవ‌ల క్యూల్లో నిల‌బ‌డి కొంద‌రు వృద్దులు మృతిచెందిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో పెద్ద‌వారికి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప్ర‌త్యేకంగా సదుపాయాలు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సాధార‌ణ ప‌నివేళ‌ల్లో మాత్ర‌మే బ్యాంకులు ప‌నిచేయ‌నున్నాయి. అద‌న‌పు స‌మ‌యం బ్యాంకులు ఉండ‌ని ప్ర‌క‌టించింది.

Recommended For You

Comments are closed.