కొంద‌రు సిబ్బంది తీరుతో బ్యాంకుల‌పైనే అప‌న‌మ్మ‌కం…!

దేశ్య వ్యాప్తంగా బ్యాంకుల్లో సిబ్బంది తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఆరోప‌ణ‌లు కాదు.. క‌ఠిన వాస్త‌వాలు. బ్యాంకు అధికారుల‌కు తెలీయ‌కుండానే నోట్ల క‌ట్ట‌లు దారి మ‌ళ్లుతున్నాయా.. సామాన్యులు తెల్ల‌వారుజామూన ప‌డిగాపులు కాస్తుంటే నాకుందుకులే అని.. అవినీతి సిబ్బంది కొంద‌రు అడ్డ‌గోలుగా అమ్మ‌డుపోతున్నారు. రాజ‌కీయ ఒత్తిడికి త‌లొగ్గుతున్నారు. ఈ పాప‌మే పండి పెద్ద‌మ‌నుషుల ఇళ్ల‌లో ఐటీ దాడుల్లో క‌రెన్సీ క‌ట్ట‌లుగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  గ్రామం, మండ‌లం, జిల్లా, రాష్ట్రం బేధం లేదు.. దేశ‌వ్యాప్తంగా అవినీతి క‌ట్ట‌ల వ‌ర‌ద బ్యాంకుల మీదుగా పారుతూనే ఉంది. ఈ పాపంలో ఖ‌చ్చితంగా బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంది. అంద‌రూ అవినీతి ప‌రులు అన‌డం లేదు. కానీ కొంద‌రు చేస్తున్న పాపాల‌తో అంద‌రూ మాట‌ప‌డాల్సి వ‌స్తోంది. ఇది ఏ ఒక్క‌రి అభిప్రాయం కాదు.. సాక్షాత్తూ సిఎంల నుంచి సామాన్యుల దాకా అదే మాట‌. మొన్న చంద్ర‌బాబు స‌మీక్ష చేసి బ్యాంకు అధికారులు స‌హ‌క‌రించాల‌ని అని చెబితే మామీద అధికారం ఏంట‌న్న‌ట్టుగా చూశారు. ప్ర‌జ‌ల బాధ‌లు ప‌ట్టించుకోవాల్సింది సిఎంలే.. వారి ఆదేశాల‌ను పాటించాల్సిందే. కానీ కొంద‌రు మేం అతీతులం అన్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించారు. మొన్న చంద్ర‌బాబు ఒక్క‌రే అస‌హ‌నంతో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ సిఎం కూడా నేరుగా విమ‌ర్శ‌లు చేయక‌పోయినా.. బ్యాంకులు  ఇంకా మెరుగ్గా, ప‌టిష్టంగా ప‌నిచేయాలంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ్యాంకులు అర్ధం చేసుకోవాలి.   కొంద‌రు బ్యాంకు అధికారులు కుమ్ముక్కు కావ‌డంతోనే పెద్ద మ‌నుషుల ఇళ్ల‌లో కోట్లు చేరుతున్నాయి. బ్యాంకుల ముందు పేద‌లు బారులు తీరుతున్నారంటూ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ వ్యాఖ్యానించ‌డం దుస్థితికి అద్దం ప‌డుతుంది. వీరే కాదు.. పంజాబ్‌, హ‌ర్యానా, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్ఘ‌డ్ రాష్ట్రాల్లోనూ బ్యాంకుల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. బ్యాంకులు నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించేందుకు కృషి చేయాలి. నిరూపించుకునే అవ‌కాశం వ‌చ్చింది. దేశానికి సేవ చేసే భాగ్యం వ‌చ్చింది. దీనిని అందిపుచ్చుకుని ప్ర‌పంచానికి సంకేతం పంపాల్సిన స‌మ‌యం. అలా కాకుండా మ‌న చేతుల్లో డ‌బ్బుంది క‌దా అని.. పేదోడ్ని కాద‌ని అవినీతికి పాల్ప‌డితే ఇప్పుడు త‌ప్పించుకోవ‌చ్చు. కానీ భ‌విష్య‌త్తులో ఆ పేదోడికీ స‌మ‌యం వ‌స్తే ఫ‌లితం అనుభ‌వించాల్సి వ‌స్తుంది. ఏ యూనియ‌న్ కూడా అప్పుడు కాపాడ‌లేదు. మ‌రి బ్యాంకుల్లో ఉండే అవినీతి అధికారులు బీ కేర్‌ఫుల్‌…

Recommended For You

Comments are closed.