బాల‌య్య స‌క్సెస్‌ల వెన‌క సీక్రెట్‌ అదేనా…!

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాపై ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురుస్తోంది. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఇందులో ఎంత ఉందో.. హీరో నంద‌మూరి బాల‌కృష్ణ అభిన‌యం అంతేస్థాయిలో తోడ్ప‌డింది. బాల‌య్య తనదైన రాజ‌సంతో ఆక‌ట్టుకున్నారు. మ‌రెవ‌రూ ఈ పాత్ర‌కు స‌రిపోల‌ర‌ని ఆయన నిరూపించారు. నటసింహం సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. బైర‌వ‌దీపం, ఆదిత్య 369, స‌మ‌ర‌సింహారెడ్డి, సింహా, లెజండ్ తరహాలో ఘ‌నంగా చాటుకునే చిత్రాల స‌ర‌స‌న నిలుస్తుంది. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే బాహుబ‌లి త‌ర్వాత ఈ స్థాయి చిత్రంగా గుర్తింపు సొంతం చేసుకుంది. నిజంగా తెలుగువారు గ‌ర్వించ‌ద‌గ్గ సినిమా. వాస్త‌వానికి బాల‌కృష్ణ ఇలాంటి హిట్లు ఎప్పుడో ఇచ్చి ఉండాలి.. దీనికి కార‌ణం ఆయ‌న పూర్తిగా ద‌ర్శ‌కుడి చేతిలో హీరో. స‌రైన ద‌ర్శ‌కుడు దొరికితే రికార్డులు సృష్టిస్తాడు. అప్ప‌డ‌ప్ప‌డూ విష‌యం లేని ద‌ర్శ‌కుల చేతిలో ప‌డి డిజాస్ట‌ర్ హీరోగా మారుతున్నాడు. వాస్త‌వానికి బాల‌కృష్ణ‌ న‌ట‌న మాత్ర‌మే తెలిసిన హీరో. ఎలా అయినా న‌టించ‌గ‌ల‌డు. ఏ పాత్ర అయినా పోషించ‌గ‌ల‌డు. ఇది కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బాబాయ్‌-అబ్బాయ్ చిత్రంలో కామెడీ పండించాడు. ఆదిత్య 369లో విభిన్న గెట‌ప్పుల‌తో అల‌రించాడు. బైర‌వ‌దీపంలో పౌరాణిక పాత్ర‌తో మెప్పించాడు. సింహ‌, లెజెండ్ చిత్రాల్లో విశ్వ‌రూపం చూపాడు. ఇంత‌క‌న్నా న‌టుడు నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంటుంది. మ‌ళ్లీ ఇప్పుడు స‌రైన ద‌ర్శ‌కుడు చేతిలో ప‌డ్డాడు.. శాత‌క‌ర్ణి రూపంలో బ్లాక్‌బస్ట‌ర్ ఇచ్చాడు. మ‌రోసారి ఎలాంటి అధ్బుతాలు చేయ‌గ‌ల‌డో బాల‌య్య‌ నిరూపించుకున్నాడు. ద‌ర్శ‌కుల ఆయుధం న‌ట‌సింహం బాల‌కృష్ణ‌.. ఆయ‌న్ను స‌రిగ్గా జ‌నాల్లోకి వ‌దిలితే రికార్డులు బ‌ద్ద‌లే. మ‌రి భ‌విష్య‌త్తులో ఎలాంటి ద‌ర్శ‌కుల చేతిలో ప‌డ‌తాడో చూద్దాం.

Recommended For You

Comments are closed.