బాహుబలి పోటీ తమిళ సినిమా ఫస్ట్ లుక్ అదుర్స్

బాహుబ‌లి మార్కెట్ చూసిన త‌ర్వాత చాలామంది నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు మొగ్గుచూపుతున్నారు. తాజాగా త‌మిళ ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌ 2వంద‌ల కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో సంఘ‌మిత్ర సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. సంఘ‌మిత్ర అనే రాజ్యాన్ని కాపాడే రాజు, రాణి క‌థే ఈ సినిమా. ఇందులో శ్రుతిహాస‌న్ సంఘ‌మిత్ర‌గా న‌టిస్తున్నారు. వీర‌వ‌నిత‌గా ఇందులో క‌నిపించ‌నున్నారు. ఆర్య‌, జ‌యం ర‌విలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రెహ‌మాన్ సంగీతం అందించే ఈ సినిమాకు ప్ర‌మోష‌న్ ఇప్ప‌టికే మొద‌లుపెట్టారు. ఆస్కార్ త‌ర్వాత అతిపెద్ద మూవీ ఈవెంట్ అయిన కేన్స్‌లో దీని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో శ్రుతిహాస‌న్ అధ్బుతంగా క‌నిపిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ప‌నిచేస్తారు. పాత తెలుగు, త‌మిళ భాష‌ల‌ను ఇందులో వాడ‌నున్నారు. ఇప్ప‌టికే హిందీలో మార్కెటింగ్ చేసే పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. త‌రుణ్ ఆద‌ర్శ్ వంటి విశ్లేష‌కులు రంగంలో దిగారు. బాలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేయ‌డానికి సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది.సోష‌ల్ మీడియాలో దీనిపై ఇప్ప‌టికే విసృతంగా ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఇండోనేషియా, మ‌లేషియా, అమెరికా మార్కెట్ల‌పై క‌న్నేశారు. మ‌రీ బాహుబ‌లి రేంజ్‌ను అందుకుంటుందా… తెలుగు ద‌ర్శ‌కుల‌కు పోటీగా రంగంలో దిగిన సుంద‌ర్ అంచ‌నాల‌కు అందుకుంటారా.. చూడాలి.

సినిమా ఫస్ట్ లుక్ కోసం ఈ వీడియో చూడండి….

Recommended For You

Comments are closed.