భారత్ కు ఆసియా కిరీటం

ఆసియా కప్ భారత్ వశం
ఆసియా కప్ భారత్ వశం

ఆరవ ఆసియా టి20 కప్ భారత్ గెలుచుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ధావన్ వీర విహారం… కోహ్లీ అధ్బుత ఇన్నింగ్స్ భారత్ ను విజయపథంలో నిలిపాయి. వర్షం కారణంగా మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ధోనీ బౌలింగ్ తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా బ్యాట్స్ మెన్ 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 13.5 ఓవర్లలోమ్యాచ్ ముగిసింది. దావన్ 44 బాల్స్ లో 60 పరుగులు చేశారు. ఇందులో 9 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. 28 బాల్స్ లో కోహ్లీ 41 పరుగులు చేశాడు. ఇందులో 5 బౌండరీలున్నాయి. బ్యాటింగ్ ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినా… ధావన్, కోహ్లీలు ధాటిగా ఆడి విజయం సాధించిపెట్టారు.

Recommended For You

Comments are closed.