అరకు ఎంపీ మాధవి పెళ్లికూతురాయనే..!

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.ఈ నెల 17న ఆమె వివాహం జరగనున్నది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 17న తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం జరగనున్నది. విశాఖ పట్నంలో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. అరకు లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గొడ్డేటి మాధవి విజయం సాధించారు. 25 యేళ్ల వయసులోనే ఆమె ఎం.పి కావడం విశేషం. దేశంలోనే అత్యంత తక్కువ ఆస్తి ఉన్న లోక్ సభ సభ్యురాలిగా కూడా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు. రాజకీయాల్లోకి రాక పూర్వం మాధవి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఎంప్లాయ్‌గా, పీఈటీగా పని చేశారు. ఆ తర్వాత వైసీపీ లో చేరిన ఆమెకు ఏకంగా అరకు లోక్ సభ సీటు దక్కింది. రాజకీయాల్లో అత్యంత జూనియర్ అయిన మాధవి ఏకంగా సీనియర్ నేత కిశోర్ చంద్రదేవ్ ను ఓడించారు. తెలుగుదేశం నుంచి బరిలోకి కిశోర్ చంద్రదేవ్ మాధవి చేతిలో భారీ మోజార్టీతో ఓటమి పాలు కావడం విశేషం. మాదవి పెళ్లికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ముఖ్య అతిథి కాబోతున్నారు. ఆమె వివాహనికి హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. పూర్తి గిరిజన సాంప్రదాయాలతో పెళ్లి చేసుకోవాలని ఎం.పి మాధవి నిర్ణయించుకున్నారని సమాచారం.

Recommended For You