ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..!

ఏపీలో కొత్త జిల్లాలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన కేసీఆర్‌.. అమలుదిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా 10 జిల్లాలు వస్తాయని తెలుస్తోంది. పార్లమెంట్‌ నియోజకవర్గాలను యూనిట్‌ గా జిల్లా చేస్తారని తెలుస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏజెన్సీలను కలిపి ఓ జిల్లాగా చేసే అవకాశం ఉంది. నర్సీపట్నం కూడా జిల్లాగా మారే అవకాశం ఉంది. గతంలో జగన్‌ ఇక్కడ హామీ ఇచ్చారు. ఇక తూర్పుగోదావరిలో మూడు జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కాకినాడ కేంద్రంగా ఉండగా.. రాజమండ్రిని మరోజిల్లా చేయనున్నారు. ఇక కోనసీమ ప్రాంతం మొత్తం కలిపి.. అమలాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడనుంది. ఇది దశాబ్ధాలుగా పెండింగ్‌ లో ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఇక ష్ణాజిల్లాలో మచిలీపట్నం, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పడనుంది. దీనికి ఎన్టీఆర్ పేరు పెట్టనున్నారు. గుంటూరులో నర్సరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని దశాబ్ధాలుగా ప్రతిపాదనలున్నాయి. ఇది కార్యరూపం దాల్చనుంది. అనంతపురంలో హిందూపురం కొత్తగా జిల్లా అవుతుంది. కర్నూలు జిల్లాలో నంద్యాల, కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. తిరుపతి కూడా కొత్తగా జిల్లా కానుంది. చిత్తూరు నుంచి విడదీసి.. తిరుపతి కేంద్రంగా శ్రీవారి పేరు వచ్చేలా జిల్లా ఏర్పాట చేయనున్నారు. మొత్తానికి రానున్న ఆరు నెలల్లో జిల్లాలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.

Recommended For You