ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిగా కేటీఆర్ ఉన్నారా?

కేటీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా ఉన్నారా?. చంద్ర‌బాబు కేబినెట్‌లో ప‌నిచేస్తున్నారా? న‌మ్మ‌క‌పోతే ఈ వార్త చూడండి…అవును ఆయ‌న ఏపీ మంత్రిగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. టి వాలెట్ కూడా ప్రారంభించార‌ట‌. జాతీయ‌స్థాయిలో పీఎం నుంచి పొలిటీషియ‌న్ల దాకా ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు అంద‌రి వాయిస్‌లు, వార్త‌లు మోసుకొచ్చి వార్తాచాన‌ళ్ల‌కు, ప‌త్రిక‌ల‌కు అందించే ప్ర‌ముఖ ఏజెన్సీ ఏఎన్ఐ ఇచ్చిన వార్త ఇది. ట్విట్ట‌ర్‌లో ఏపీ మంత్రి కేటీఆర్ అంటూ అప్‌డేట్ చేసింది. నెటిజ‌న్లు ఊరికే ఉంటారా.. సంస్థ‌పై  స‌టైర్లు వేశారు. చిర్రుబుర్రులాడారు. చివ‌ర‌కు కేటీఆర్ కూడా నేను ఏపీ మంత్రిని కాదు.. తెలంగాణ మంత్రిని… రాష్ట్రం విడిపోయి స‌రిగ్గా మూడేళ్లు అవుతుందంటూ ట్విట్ట‌ర్‌లో సంస్థ‌కు రిట్వీట్ చేశారు. దీంతో త‌ప్పు తెలుసుకున్న సంస్థ‌.. వార్త‌ను తొల‌గించింది. ఇది ఏపీమంత్రి కేటీఆర్ క‌థ‌.

ట్విట్టర్ కామెంట్ల కోసం వాచ్ దిస్ వీడియో

Recommended For You

Comments are closed.