వైసీపీలో చేరేందుకు అఖిల ప్రియ మాస్టర్ ప్లాన్!!?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాజ‌యం ఎదుర్కున్న నేప‌థ్యంలో అధినేత చంద్ర‌బాబు నాయుడుకు మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఏపీలో టీడీపీ మ‌రోసారి అధికారంలోకి రావాలంటే సుమారు 20 సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని గ్రహించి చాలామంది టీడీపీ నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ముందు వ‌రుస‌లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆమె సోద‌రుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో ఆమె తల్లి శోభానాగిరెడ్డి అకాల మ‌ర‌ణంతో భూమా అఖిల ప్రియ చిన్న వ‌య‌స్సులోనే రాజ‌కీయ అరంగేట్రం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే కొన్ని అనివార్య కార‌ణాల‌వ‌ల్ల భూమా ఫ్యామిలీ టీడీపీ తీర్థం తీసుకుంది. ఆ త‌ర్వాత నంద్యాల‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న‌ ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి కొంత‌కాలానికి అణారోగ్యంతో మ‌ర‌ణించారు. దీంతో అఖిల ప్రియ సోద‌రుడు బ్ర‌హ్మానంద‌రెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.

ఆ త‌ర్వాత ఆమెకు చంద్ర‌బాబు నాయుడు త‌న కేబినెట్ లో మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌డంతో అప్ప‌టి ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు నంద్యాల ఆళ్ల‌గ‌డ్డ‌లో గెలిచి చంద్ర‌బాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇస్తామన్న‌ అఖిల ప్రియ ఈ ఎన్నిక‌ల్లో పార్టీ అధికారం కోల్పోవ‌డ‌మే కాకుండా తాను పోటీ చేసిన ఆళ్ల‌గ‌డ్డ శాసనస‌భ స్థానంలో కూడా గెలువ‌లేక‌పోయింది.

దీంతో అఖిల ప్రియ పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆమె వైసీపీ వైపు చూస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న పాత బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ‌తో మంతనాలు కూడా సాగిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ బంధుత్వానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా లేదా అనేది చూడాలి..

Also Watch:

Recommended For You