3.2 మిలియ‌న్ బ్యాంకు ఖాతాల్లో డబ్బు మాయం?

దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల‌కు చెందిన 32 లక్ష‌లు డెబిట్ కార్డుల్లో స‌మాచారం దొంగ‌ల చేతికి పోయింది. కేవ‌లం స‌మాచారం మాత్ర‌మే కాదు.. ఖాతాల్లో డ‌బ్బు కూడా మాయమ‌వుతోంది. దేశ వ్యాప్తంగా క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌కుండానే కోట్లాది రూపాయలు ఖ‌ర్చు అవుతున్నాయి. చైనాతో పాటు అమెరికాలో డెబిట్ కార్డులు వాడుతున్న‌ట్టు బ్యాంకులు గుర్తించాయి. మొత్తం 19 బ్యాంకులు సంబంధించిన 641 మంది ఖాతాదారుల నుంచి కోటీ 30ల‌క్ష‌లు రూపాయ‌ల న‌గ‌దు మాయం అయిన‌ట్టు అక్టోబ‌ర్ 20 వ‌ర‌కూ ఫిర్యాదులు అందాయ‌ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వం చెబుతున్న దాని కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో న‌గ‌దు హాక‌ర్స్ వాడి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప‌రిస్థితి చేజారి పోతుండ‌డం, ఫిర్యాదులు వెల్లువెత్తుతుండ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అటు బ్యాంకులు కూడా న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌పై దృష్టి సారించాయి. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురి కావొద్ద‌ని కార్డులు బ్లాక్ చేసి లావాదేవీలు అపేశామంటున్నారు. కొత్త కార్డులు జారీ చేస్తామ‌ని చెబుతున్నారు. దేశంలో ఉన్న 99.5శాతం కార్డులు సేఫ్‌గా ఉన్నాయ‌ని.. కేవ‌లం 0.5శాతం మాత్ర‌మే హాక్ అయ్యాయ‌ని బ్యాంకు నిపుణులంటున్నారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 6ల‌క్ష‌ల 25వేల కార్డుల‌ను బ్లాక్ చేసింది. న‌గ‌దు పోయిన ఖాతాదారుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని బ్యాంకు ప్ర‌క‌టించింది. ఇత‌ర బ్యాంకుల ఏటీఎమ్‌ల‌లో త‌మ కార్డులు హ్యాక్ అయి ఉంటాయ‌ని బ్యాంకు ప్ర‌క‌టించింది.

Recommended For You

Comments are closed.