విహారయాత్రలోనూ స్పెషల్ చూపించిన రేవంత్ రెడ్డి..?

మండె ఎండల్లో అలుపెరగకుండా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీచేసిన రేవంత్… మిగతా కాంగ్రెస్ నాయకుల కంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు. పెద్ద నియోజకవర్గం కావడంతో క్షణం తీరిక లేకుండా పర్యటనలు చేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రమంతా పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికలు మెగిసిన వెంటనే ఆయన విశ్రాంతి కోసం టూరు ప్లానేశారు. కానీ అనూహ్యంగా ఇంటర్ విద్యార్ధులు ఇష్యూ తెరమీదకు రావడంతో ఉద్యమబాట పట్టారు. టూరు వాయిదా వేశారు. పరిస్థితి సర్దుమణగంతో పాటు.. ఇంటర్ బోర్డు కూడా న్యాయం చేస్తామని హామీ  ఇచ్చింది. దీంతో కొద్ది రోజులు విశ్రాంతి కోసం విహార యాత్రకు వెళ్లారు. హిమాలయాలకు వెళ్లి సేద తీరుతున్నారు. అక్కడ కూడా తనమార్కు స్టైల్ వదలలేదు.. సరిహద్దుల్లో సైనికులతో కలిసి మాటామంతి కలిపారు.అంతే కాదు.. వారితో ఫోటో దిగి.. వారిని కొనియాడుతూ మరీ పోస్ట్ చేశారు. మొత్తానికి రేవంత్ ఎక్కడున్న తన వాయిస్ ఏదో రూపంలో వినిపిస్తాడు.

Watch Video:

Recommended For You