యాదాద్రిమీద ప్రేమేనా.. విద్యార్ధులపై లేదా కేసీఆర్?- రేవంత్ రెడ్డి

గుడి కంటే బడి గొప్పదంటారు.. కానీ కేసీఆర్ విద్యార్ధులకు భవిష్యత్తు నిచ్చే బడి కంటే గుడినే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రిపై చూపిన ప్రేమలో 10శాతం విద్యార్ధులపై చూపినా ఇంటర్ స్టూడెంట్స్ కు ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు రేవంత్ రెడ్డి. ఇన్ని ఆత్మహత్యలకు కారణమైనవాళ్లను దేవుడు కూడా క్షమించడన్నారు. ఏమాత్రం బాధ్యత ఉన్నా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలన్నారు. రాజకీయ వలసలు.. దేవుళ్ల తప్ప మరో పట్టింపు లేని ప్రభుత్వానికి ప్రజలే తిరుగబడే రోజు వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారో… ఈ క్రింద వీడియోలో చూడండి…

Watch Video:

Recommended For You