మైనర్ ను ప్రేమిస్తే పరిస్థితి ఎంటో తెలుసా..!

ఓ బాలిక సెలవల కావడంతో అరబ్ దేశం నుంచి పాతబస్తీ బంధువుల ఇంటికి వచ్చింది. మరో దేశంలో స్థిరపడ్డ కుటుంబమది.. ఇక్కడకు వచ్చిన ఈ బాలికకు బంధువుల ఇంటి సమీపంలో ఉండే ఓ యువకుడి తెగ నచ్చేశాడు. ఆకర్శణ అని అర్ధం చేసుకోలేని ఆ బాలిక.. ప్రేమగా భావించింది. యువకుడు కూడా అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమించాడు కానీ  ఆమె వయసు గురించి ఆలోచించలేదు. ఇద్దరు కలిసి పెద్దలు తమకు అడ్డు వస్తారని భావించి  ఇల్లు వదిలిపోయారు. బాలిక మాయం కావడంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. ఫలక్ నూమా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు మహానగరాలన్నీ గాలించారు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. చివరకు నగరంలోనే పటాన్ చెరు లో యువకుడి మేనమామ ఇంటి వద్ద ఉన్నట్టు తెలుసుకుని వారిని తీసుకొచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు బాలిక దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. తల్లిదండ్రులతో వెళ్లేది లేదని.. అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మైనర్ చేసుకోకూడదని చెప్పినా వినలేదట. దీంతో కోర్టు  ఆదేశాలతో ఆమెను హోంకు తరలించారు. యువకుడిని కటకటాలపాలు చేశాడు. మొత్తానికి ఫలక్ నూమాలో జరిగిన ఈ ఘటనతో మైనర్ల ను ప్రేమిస్తే ఏమవుతుందో తెలియజెప్పింది.. బీ కేర్ ఫుల్ అంటున్నారు పోలీసులు.

Recommended For You