మెగా ఫ్యామిలీలో నాగబాబు టెన్షన్..!

ఇటీవలకాలంలో నాగబాబు కామెంట్లు, పోస్టులు రాజకీయంగానే కాదు.. ఇండస్ట్రీ పరంగా విమర్శలకు
తావిస్తోంది. ఆయన వల్ల మెగా కాంపౌండ్ కూడా ఇబ్బంది పడినట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇందులో భాగంగా కొన్ని సంఘటనలు గుర్తుచేస్తున్నారు..

మల్లెమాలతో వివాదం…
మల్లెమాల, చిరంజీవి కుటుంబాలకు విడదీయరాని సంబంధం ఉంది. శ్యాంప్రసాద్ రెడ్డి, చిరంజీవి ఆప్త
మిత్రులు. వారిమధ్య బంధం గురించి ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నిర్మాత, హీరో మధ్యసంబంధం కాకుండా…
అంతకుమించిన స్నేహసంబంధాలున్నాయి. అందుకే నాగబాబుతో కూడా వీళ్లు జబర్దస్త్ షో చేయడానికి ఓ
కారణం. ఇటీవల నాగబాబు క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో వారితో విబేధించారు. పోటీగా మరో ఛానల్ తో కలిసి
కొత్త షో పెట్టారు. ఇది మెగా కుటుంబానికి పెద్ద ఎంబ్రాసింగ్ అయిందని అప్పట్టలో టాక్.

సోషల్ మీడియా పోస్టులు…
జబర్తస్త్ షో కారణంగా నాగబాబు సోషల్ మీడియాకు భాగా కనెక్ట్ అయ్యారు. యూ ట్యూబ్లో సొంతఛానల్
కూడా పెట్టారు. జబర్తస్త్ నేపథ్యంలో వచ్చే గాసిప్స్, ఇంటర్వ్యూలు ఆయన్ను అటుగా మళ్లించాయి. దీంతో
సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకోవడం మొదలుపెట్టారు. అంశాలవారీగా ఆయన
అభిప్రాయాలు చెబితే ఓకే.. కానీ ఇందుకు భిన్నంగా వివాదస్పద అంశాలపై స్పందిస్తున్నారు. ఏకంగా
గాంధీని చంపిన గాడ్సే దేశభక్డుడు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు స్రుష్టించాయి.
వాస్తవానికి చిరంజీవి అయినా.. పవన్ కల్యాణ్ అయినా గాంధీని ఎక్కువగా అభిమానిస్తారు. పార్టీలు పెట్టిన
వీరి ఎజెండా కూడా ఇదే. కానీ ఇందుకు భిన్నంగా నాగబాబు పెట్టిన పోస్ట్ దుమారమే రేపింది. మెగా
ఫ్యామిలీని నెట్టింటకు నెట్టింది. చివరకు పవన్ కూడా పార్టీ తరపున ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. నాగబాబు
వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని.. ఇందులో పార్టీకి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. తాజాగా
బాలక్రిష్ణ వ్యవహారంలోనూ మళ్లీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తాజాగా టీడీపీ పట్ల
వ్యాఖ్యలు కలకలం రేపాయి. వాస్తవానికి నాగబాబు వ్యాఖ్యలకు చిరంజీవి, పవన్ కల్యాణ్ దూరంగా
ఉంటున్నారు. ఆయన తన సోషల్ మీడియా హిట్స్ అలా చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అభిమానులు
కూడా నాగబాబు వ్యాఖ్యలపై ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ అభిమానులు. మెగా
కాంపౌండ్ కు అయితే కాస్త నాగబాబు పోస్టులు సమస్యలు తీసుకొస్తున్నాయి. మరి నాగబాబు ఇంకెన్ని
సంచలనాలకు కారణమవుతారో చూడాలి.

Recommended For You